ఈ వేసవి కాలం వచ్చిందంటే చాలు శరీరానికి చల్లబరిచె ఫుడ్ ఐటమ్స్ కు మంచి గిరాకి ఉంటుందని చెప్పవచ్చు. ఇక జనం కూడా తమ శరీరాన్ని కూల్ చేస్తే వాటి కోసం చాలా ఎగబడుతూ తింటూ ఉంటారు. ఎన్ని కూల్డ్రింక్స్ తాగిన ఇన్ ఐస్ క్రీమ్స్ తిన్నా కూడా సహజ సిద్ధంగా దొరికే ఎటువంటి వాటితోనే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ హాట్ సమ్మర్ లో బాడి చల్లబడాలంటే కేవలం అది తాటి ముంజల ద్వారానే అని చెప్పవచ్చు. ఇది ఎక్కడైనా గ్రామాలలో బాగా ఎక్కువగా దొరుకుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో కొన్ని పట్టణాలలో కూడా వాటిని తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు ప్రజలు. ఈ కాయలు యొక్క ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1).ఈ పండ్లలో తక్కువగా క్యాలరీలు ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన శక్తి విడుదల అవుతుంది. కాబట్టి వేసవి కాలంలో చలువ కోసం తాటి ముంజలు తినడం చాలా ముఖ్యం. ఇక ముఖం మీద వచ్చిన మొటిమలు పోవాలంటే వీటిని తింటే సరి.

2).ఎండాకాలంలో ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి లేదంటే మన శరీరం డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. అయితే తాటికాయల  ఈ వేసవి కాలంలో తరచూ తింటూ ఉండడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మన శరీరానికి కావల్సినంత విటమిన్ బి, క్యాల్షియం లభిస్తుంది.

3). గర్భంతో ఉన్నవారు ఏదైనా జీర్ణం అవ్వక ఇబ్బంది పడుతుంటే వారికి ఈ తాటి ముంజలు తినిపించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా అలాంటి సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటి సమస్యను కూడా దూరం చేస్తుంది.

4). తాటి ముంజల లో మన శరీరానికి కావాల్సిన విటమిన్ A,B,C వంటివి పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో జింక్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉండటం వల్ల చికెన్ ఫాక్స్ సమస్యతో బాధపడే వారిని ఉపశమనం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: