నేటి కాలంలో ప్రతీఒక్కరికీ ఎక్సర్‌సైజ్ ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఎవరికైనా సరే ఎక్సర్‌సైజ్ చేయాలంటే ఉదయాన్నే లేవడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ నేటి త‌రంలో చాలా మంది ఫిట్‌నెస్‌పై మక్కువ ఎక్కువ చూపుతున్నారు. మ‌రియు హెల్దీగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్‌, డ్యాన్స్, యోగా క్లాసెస్ ఇలా ఏదో వర్కౌట్ ఆప్షన్‌ని ఎంచుకుని తాము ఫిట్‌గా మారేందుకు కసరత్తులు చేసేస్తున్నారు.  అలాగే రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఇమ్యూనిటి పెరుగుతుంది. 

 

అలాగే క్ర‌మంత‌ప్ప‌కుండా ఎక్సర్‌సైజ్ చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎక్సర్‌సైజ్ చేయ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఎక్సర్‌సైజ్ విషయంలో చాలా జాగ్రత్తలు వ‌హించాలి. లేదంటే లేని స‌మ‌స్య‌లను తెచ్చిపెట్టుకున్న‌ట్టు అవుతుంది. అందులో ముఖ్యంగా.. ఎక్సర్‌సైజ్  చేసేవారు సిగరెట్ ఉంటే ఆ చెడు ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇది ప్రాణాల మీదకే తీసుకొస్తుందని.. అందుకే వ్యాయామం చేసేవారు దీనికి వీలైనంత దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే.. ఎక్సర్‌సైజ్ చేసే టైమ్‌లో ముప్పై శాతం ఎక్కువగా ఆక్సిజన్ విడుదల అవుతుంది. 

 

అదే సిగరెట్ తాగేవారిలో అయితే మైనస్ ముప్పై శాతం ఆక్సిజన్ విడుదల అవుతుంది. ఇలాంటి వారు వ్యాయామం చేస్తూ ఉంటే ఆక్సిజన్ అందక గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే  వ్యాయామం చేసేవారు ఖ‌చ్చితంగా సిగరెట్‌కి దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. అలాగే సిగరెట్ తాగ‌డం వ‌ల్ల ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఒక్క‌సారి దీని మ‌త్తులో ప‌డితే.. బ‌య‌ట‌కు రావ‌డం చాలా క‌ష్ట‌త‌రం అవుతుంది.  ఆహారం తినకుండా ఉంటారేమో కానీ, సిగరెట్ తాగకుండా మాత్రం అస్సలు ఉండలేరు. దీంతో లంగ్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌. అందుకే నెమ్మ‌ది నెమ్మ‌దిగా దీనికి దూరంగా రావ‌డానికి ప్ర‌య‌త్నించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: