మరమరాలతో ఎన్నో రకాల స్నాక్స్, స్వీట్స్, పాయసం , టిఫిన్స్ చేసుకోవచ్చు.. అయితే ఇవి తినేవరకు తేలిగ్గానే ఉంటుంది.. కానీ పొట్ట నిండుతుంది.అయితే వీటిని తీసుకోవడం చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు.. మరి మరమరాలు వెనక ఉన్న ఆ మర్మరం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని బియ్యం తో తయారు చేస్తారు.. అందుకే కొన్ని ప్రాంతాల్లో బొరుగులు అని, మరి కొన్ని ప్రాంతాల్లో మరమరాలు, పఫుడ్ రైస్ అని అంటారు.బియ్యం కు అధిక పీడనాన్ని అందించితే ఇవి తయారు అవుతాయి.

భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇవి ప్రాచుర్యం పొందాయి. అలాగే పొరుగు దేశాలైనా బంగ్లాదేశ్, పాకిస్థాన్లోనూ ప్రసిద్ధి చెందాయి.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక కొవ్వు, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం తీవ్ర సమస్యగా మారింది. ఒక వ్యక్తి కేవలం జంక్ ఫుడ్ మాత్రమే తిన్నట్లయితే, అందులోని కొవ్వు పదార్థాలతో జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. దీంతో పొట్ట ఉబ్బి.. మలబద్దకం సమస్య ను తగ్గిస్తుంది. ఇకపోతే వీటిని అలానే తీసుకున్న, లేదా కొన్ని స్పైసెస్ యాడ్ చేసిన, టిఫిన్ చేసి తీసుకున్నా కూడా రుచి మారుతుంది కానీ ఆరోగ్యంలో కాదని నిపుణులు అంటున్నారు.

అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు తరచూ వీటిని తీసుకోవడం వల్ల అవి దూరమవుతాయి. మరమరాలు చాలా తేలినకైన ఆహారం. చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఇవి మీకు సహాయపడుతాయి. నిల్వ కొవ్వులను కూడా ఈ మరమరాలు ఇట్టే కరిగిస్తాయి అని అంటున్నారు. 100 గ్రాముల మరమరాలు తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్ అందుతుంది. రోజూ మంచి మొత్తంలో ఫైబర్ తీసుకోవడం వల్ల మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.విటమిన్ డీ, క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మీకు బలమైన ఎముకలు, దంతాలు ఉండేలా చూసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎముకలు విరిగినప్పుడు వీటిని తీసుకోవడం మంచిది.. చూసారుగా ఈ మరమరాలు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పటి నుంచి మీరు కూడా మరమరాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి ..

మరింత సమాచారం తెలుసుకోండి: