మనం వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరలలో బెండకాయ కూడా ఒకటి. వీటితో మనం ఎన్నో రకాలు వంటలు చేసుకోవచ్చు. అయితే ఈ బెండకాయ కి ఉన్న జిగురు వల్ల చాలామంది వీటిని తినడానికి ఇష్టపడరు. అయితే రుచి లో అద్భుతమైన రుచిని అందించడంలో బెండకాయ కు ఎటువంటి కూరగాయలు సాటిరావని చెప్పవచ్చు. అయితే అలా జిగురు తో ఇబ్బంది పడేవారికి ఇప్పుడు ఒక చక్కని చిట్కా ద్వారా ఆ జిగురును తొలగించుకోవచ్చు. వాటి గురించి పూర్తి వివరాలను మనం చూద్దాం.

ఎక్కువమంది జిగురు ఉన్న బెండకాయలను తినడానికి ఇష్టపడరు.. కేవలం పొడిగా ఉన్న బెండకాయలను మాత్రమే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి జిగురు ఉన్న బెండకాయలను కట్ చేయడానికి మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసం.. ముందుగా బెండకాయలను కడిగి తర్వాత బాగా వాటిని ఆరబెట్టాలి. ఒకవేళ బెండకాయలను కట్ చేయవలసి ఉంటే కట్ చేసిన తర్వాత వాటిని బాగా ఆరబెట్టి కూరలోకి ఉపయోగించుకోవాలి. ఒకవేళ బెండకాయల కు ప్రేమ ఉన్నట్లు అయితే ఎక్కువగా జిగట పెరుగుతుందట. అందుచేతనే కడిగిన తర్వాత ఆరబెట్టి వాటిని కట్ చేయడం మంచిది.

1). బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కంటే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయడం మంచిది చిన్నగా కట్ చేయడం వల్ల అవి నుజ్జుగా తయారయి జిగురు ఎక్కువగా వస్తుంది.

2). బెండకాయలను చేదు నుంచి తొలగించుకోవడానికి.. మీరు  ఉడికించిన తరువాత వాటిలోకి కొద్దిగా నిమ్మరసం లేదా ఆమ్చూర్ జోడించడం వల్ల ఆమ్ల మూలకాలతో అది ప్రతిస్పందించి ఆ చేదు గుణాన్ని తరిమి వేస్తుంది. ఇక అంతే కాకుండా ఇలా చేయడం వల్ల బెండకాయ నుంచి వచ్చే జిగట కూడా పోయి కూర చాలా రుచిగా ఉంటుందట. అయితే ఇది కేవలం ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: