గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం...కాస్త టీడీపీకి బలం ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆరుసార్లు గెలిచింది. చివరి రెండు ఎన్నికల్లో వరుసగా టీడీపీనే గెలుస్తూ వస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ గెలుస్తున్నారు. అయితే రెండోసారి ఎమ్మెల్యే అయిన అనగాని దూకుడుగా పనిచేయడం లేదు. ప్రతిపక్ష స్థానంలో ఉండటంతో నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు.


ఈయన ఎంతసేపు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. కనీసం పార్టీ తరుపున వైసీపీ ప్రభుత్వంపై పోరాటం కూడా చేయడం లేదు. అంతకముందు అధికారంలో ఉన్నప్పుడు బాగానే పనిచేసిన అనగాని, ప్రతిపక్షంలోకి వచ్చాక మెరుగైన పనితీరు కనబర్చడం లేదు. పైగా ఈయన పార్టీ మారిపోతారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ పార్టీ మారలేదు. అలా అని పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు.


నియోజకవర్గంలో పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. రేపల్లె మున్సిపాలిటీలో వైసీపీ హవా నడిచింది. ప్రస్తుతానికి ఇక్కడ వైసీపీ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ తరుపున రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పని చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్న మోపిదేవికి జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చారు. అయితే మధ్యలో మండలి రద్దు నేపథ్యంలో ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాజ్యసభ ఇచ్చారు.


ఇక మోపిదేవి రాజ్యసభకు వెళ్లడంతో రేపల్లెలో పార్టీ బాధ్యతలు ఆయన సోదరుడు హరినాథ్ చూసుకుంటున్నారు. అన్న సపోర్ట్‌తో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలాంటి లోటు లేకుండా అందిస్తున్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో పార్టీకి మంచి విజయాలు దక్కడంలో కీలక పాత్ర పోషించారు. ఒకవేళ మోపిదేవి రాజ్యసభకే కంటిన్యూ  అయితే నెక్స్ట్ ఎన్నికల్లో రేపల్లెలో ఆయన సోదరుడు పోటీ చేసే అవకాశం ఉంది. ఎలాగో టీడీపీ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేయడంతో ఇక్కడ వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: