పవన్ కళ్యాణ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.  ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయ్యారు.  సినిమాల్లో ఇకపై అడుగు పెట్టేది లేదని తేల్చిపారేశారు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి.  ఈ సినిమాలో సుప్రియ హీరోయిన్.  


ఇద్దరిది మొదటి సినిమానే.  పవన్ తో కలిసి పనిచేసిన సుప్రియ ఆ సినిమా గురించి అనేక విషయాలను మీడియాతో పంచుకుంది.  పవన్‌కల్యాణ్‌ తెగ సిగ్గు పడిపోతూ ఉండేవారు. ఆయన జెంటిల్‌మెన్‌. నేను మాత్రం నాపై నమ్మకంతో చేసేసేదాన్ని. ఇంకో విషయమేంటంటే.. ఆ సినిమా సమయంలో ఇండస్ట్రీలో స్ట్రైక్‌ జరుగుతోంది. దాదాపు ఏడెనిమిది నెలల పాటు జరిగింది. 


దాంతో చాలా మంది టెక్నిషీయన్లు మారిపోయేవారు. అప్పుడు కల్యాణ్‌ చాలా టెన్షన్‌ ఫీలయ్యారు. ఎందుకంటే హీరోగా ఫస్ట్‌ సినిమా కావడంతో చాలా ఒత్తిడి ఉండేది. నాకు అంతగా ఏమీ అనిపించేది కాదు. పొద్దునే వెళ్లడం నా పని నేను చేసుకురావడం. కానీ ఒక కంప్లయింట్‌ మాత్రం ఉండేది. అప్పట్లో హీరోల జుట్టు నొసలవరకూ పొడుగ్గా ఉండేది. కళ్లజోడు పెట్టేవారు. 


మీసం కూడా కాస్త పొడవుగా ఉండేది. క్లోజప్‌ పెడతారు. ‘ఎక్స్‌ప్రెషన్‌’ అని అడుగుతారు. ఏం కనపడుతుంది. హీరో ఏ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడో తెలియక నేనేమో తెల్లమొహం వేసేదాన్ని. నాలుగైదు టేక్‌లు తీసుకునే దాన్ని. ‘ది గ్రేట్‌ నాగేశ్వరరావుగారి మనవరాలు నాలుగు టేకులా’ అన్నట్లు చూసేవారు. నాకు చాలా కోపం వచ్చేది. ‘నువ్వు(పవన్‌) కళ్లజోడు లేకుండా వచ్చి చెయ్‌’ అని ఆయనతోసరదాగా గొడవ పడుతూ ఉండేదాన్ని అని చెప్పింది.  ఈ సినిమా తరువాత సుప్రియ సినిమాలకు దూరంగా ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు నిర్వహిస్తోంది.  ఇటీవలే గూఢచారి సినిమాలో పోలీస్ ఆఫీస్ రోల్ ప్లే చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: