తెలుగు సినీ లవర్స్ కు బాగా పాపులర్ అయిన షార్ట్ ఫిలంస్ గురించి తెలిసిందే. అందులో చాందిని చౌదరి మధురం తెలిసే ఉంటుంది. అప్పటివరకు ఐదారు, పది నిమిషాల వరకే షార్ట్ ఫిలింస్ చేసిన చాందిని చౌదరి మధురంలో దాదాపు గంట పాటు నటించింది. ఆ సినిమా మొత్తం ఓ కేఫ్ లోనే ఉంటుంది. ఇక ఈ సినిమా తర్వాత అమ్మడికి తెలుగులో అవకాశాలు వచ్చాయి. కేవలం యూట్యూబ్ లోనే రిలీజైన మధురం సినిమా తర్వాత చాందిని క్రేజ్ పెరిగింది. మహేష్ బ్రహ్మోత్సవంలో ఓ చిన్న పాత్ర చేసిన చాందిని తర్వాత కుందనపు బొమ్మ సినిమా చేసింది.

హౌరా బ్రిడ్జ్, మను సినిమాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు. కలర్ ఫోటో హిట్ అవడంతో చాందినికి సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ వెంటనే ఛాన్సులు వస్తున్నాయి. లేటెస్ట్ గా చాందిని చౌదరి నటిస్తున్న సినిమా సమ్మతమే టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సమ్మతమే లవ్ ఈజ్ అన్ కండీషనల్ ట్యాగ్ లైన్ తో ఈ సినిమా వస్తుంది. నూతన దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రాజా వారు రాణి వారు సినిమా హీరో కిరణ్ అబ్బవరం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టరే సినిమాపై అంచనాలు పెంచింది.

ప్యూర్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరించేలా ఉంది. కలర్ ఫోటోతో తన ఫేట్ మార్చుకున్న చాందిని ఇక మీదట అలనాటి సినిమాలనే చేస్తుందని చెప్పొచ్చు. యూట్యూబ్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న చాందిని చౌదరి వరుస సినిమాలు చేయడంలో వెనకపడ్డది. తప్పకుండా ఈ సినిమాతో చాందిని మరోసారి తన సత్తా చాటుతుందని చెప్పొచ్చు.                    

మరింత సమాచారం తెలుసుకోండి: