అమ్మాయిల హృదయాలను దోచి, కలల హీరోగా మారి కనపడని లోకాలకు వెళ్లిపోయిన యంగ్ హీరో ఉదయ్ కిరణ్. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా, లవర్ బాయ్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆఫర్లు లేకపోవడం, తీసిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో అతడు వెండితెరకు దూరమయ్యాడు. అనంతరం అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకని తనువు చాలించాడు. 

ఉదయ్ కిరణ్ చనిపోయిన ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ అతడి గురించి ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే అతడి గురించి ఓ విషయం బయటకొచ్చింది. అదేంటంటే.. ఉదయ్ కూడా ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడట. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టులో తన క్యారెక్టర్ నచ్చక సినిమా నుంచి తప్పుకున్నాడట. అంతేకాదు ఉదయ్ తప్పుకున్న ఆ మల్టీస్టారర్ సినిమా రిలీజై భారీ డిజాస్టర్‌గా నిలవడమే కాకుండా ఆ రెండో హీరోకు కూడా సినిమాలు లేకుండా చేసింది.

లవర్ బాయ్‌గా ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న అతికొద్ది మంది యువ హీరోల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. అతని సినిమాలకు అప్పట్లో అమ్మాయిలు థియేటర్స్ వద్ద క్యూ కట్టేవారు. అబ్బాయిలు కూడా అతని సినిమాల కోసం ఎగబడేవారు. అంతలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

 ఎలాంటి సినిమా చేసినా ఉదయ్ కిరణ్ ప్రాణం పెట్టి చేసేవాడు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టేవాడు కాదు. నువ్వు నేను లాంటి హిట్ సినిమా తరువాత కూడా అందరిలాగే ఓకేసారి రెమ్యునరేషన్ పెంచలేదు. ఇచ్చిన కమిట్మెంట్స్ కారణంగా చాలా సినిమాలకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే సంతోషపడ్డాడు. అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చగా నడిచింది.

ఉదయ్ కిరణ్‌ కెరీర్ కొంత స్టో అయిన స్టేజ్‌లో ఓ మల్టీస్టారర్ స్టోరీ అతడి వద్దకొచ్చింది. అదే  రవిబాబు డైరెక్ట్ చేసిన సోగ్గాడు. ఈ సినిమా 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఒకే అమ్మాయిని లవ్ చేస్తుంటారు. అందులో తరుణ్, ఉదయ్ కిరణ్‌‌లను హీరోలుగా పెట్టాలని రవిబాబు అనుకున్నాడట.

రవిబాబు ఇదే విషయాన్ని చెప్పగా ఉదయ్‌ కూడా ఓకే చెప్పాడట. కానీ కథలో తన పాత్ర తక్కువగా ఉండడం, తరుణ్ పాత్ర ఎక్కువగా ఉండడంతో చివర్లో రిజెక్ట్ చేశాడట. దీంతో అతడి స్థానంలో జుగల్ హాన్స్ రాజ్ అనే హిందీ యాక్టర్‌ను తీసుకున్నాడు రవిబాబు. అయితే ఈ సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకొచ్చినా.. డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని రవిబాబే స్వయంగా చెప్పాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: