అక్కినేని నాగార్జున నటిస్తున్న సినిమాలు వరుస ప్లాపులు అవుతున్న కూడా ఆయన వరుస సినిమాలను చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారుతుంది. ప్రస్తుతం ఆయన హీరోగా రెండు చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గోస్ట్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నాగార్జున అదే సమయంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు వేటికవే విభిన్నమైన జోనర్ లలో తెరకెక్కిస్తు ఉండగా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

గరుడ వేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు చేయబోతున్న ఘోస్ట్ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ముఖ్యంగా అక్కినేని అభిమానులు అయితే ఈ చిత్రం ద్వారా నాగ్ తప్పకుండా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. గత కొన్ని సినిమా లు గా నాగ్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ గా నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ చిత్రం హిట్ కొడితే ఆయన కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని వారి ఆలోచన. 

ఇకపోతే నాగార్జున కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు చిత్రం పై కూడా ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలోని కంటెంట్ వల్ల ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. కళ్యాణ్ కృష్ణ కూడా సోగ్గాడే చిన్నినాయన తర్వాత ఏ సినిమా హిట్ హిట్ కొట్టకపోవడం తో ఈ సినిమా తో హిట్ కొట్టాలనే కసితో ఉండడం ఈ సినిమాపై నమ్మకం ఏర్పడుతుంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ లుగా నాగార్జున ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడిపోయాడు. ఓ వైపు ఇలియానా మరోవైపు త్రిష లు ఇద్దరు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా హీరోయిన్ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: