ఇటీవలి కాలంలో ఎంతోమంది తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న నటులుగా గా ఎంట్రీ ఇచ్చిన వారు ఆ తర్వాత మాత్రం హీరో గా మారిపోతున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉన్న సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఎంతగానో ఫేమస్ అయిపోతున్నారు. ఇలా ఇటీవల కలర్ ఫోటో అనే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుహాస్.  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సాదా సీదా నటుడిగానే ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కమెడియన్గా కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.


 ఇక తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు అనే చెప్పాలి. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా కమెడియన్ గా నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు సుహాస్. సుహాస్ ఒక్కసారిగా కలర్ ఫోటో సినిమాతో హీరోగా అవతారమెత్తాడు.  మొదట సుహాస్ హీరో ఏంటి అని అనుకున్నారు అందరు. కలర్ ఫోటో సినిమా చూసిన తర్వాత అతని నటనకు ఫిదా అయిపోయారు అని చెప్పాలి.  విభిన్నమైన లవ్ స్టోరీ నేపథ్యంలో తెర మీదికి వచ్చిన ఈ సినిమా యూత్ ని తెగ ఆకర్షించింది.




 ఈ సినిమా తర్వాత అటు సుహాస్ మంచి అవకాశాలను అందుకుంటున్నాడు.  అయితే సాధారణంగా చాలామంది నటుల లో ఎవరికీ తెలియని ఒక టాలెంట్ దాగి ఉంటుంది. ఇక అటు తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్గా హీరోగా ప్రేక్షకులను అలరించిన సుహాస్ లో కూడా ఒక అదిరిపోయే టాలెంట్ దాగి ఉంది అన్నది బయటపడింది.  ఇటీవలే ఈ టీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో ఒక అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు సుహాస్.  ఇటీవలే సెలబ్రిటీలతో కంటెస్టెంట్స్ డాన్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ను చేశారు. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇందులో భాగంగా ఇద్దరు యువతులతో సుహాస్ అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: