తెలుగు సినిమా పరిశ్రమకి తొలిసారిగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన నటి కృతి శెట్టి. మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి నెగటివ్ పాత్ర చేసిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ తరువాత సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

ఇక ఉప్పెన లో బేబమ్మగా తనదైన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరి మనసులు దోచుకున్న కృతి శెట్టి ఇటీవల నాని సరసన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ప్రస్తతం ఆ మూవీ కూడా హిట్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఆ విధంగా కెరీర్ లో చేసిన రెండు సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకుని బాగా పేరు అందుకున్న కృతి నటిస్తున్న లేటెస్ట్ సినిమా బంగార్రాజు. నాగార్జున, నాగచైతన్య కలయికలో కళ్యాణ్ కృష్ణ తీస్తున్న ఈ భారీ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 14న ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ అందించిన సాంగ్స్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి. 

ఇక ఈ మూవీలో నాగచైతన్య కి జోడీగా నటిస్తున్న కృతి, తన పాత్రలో అదరగొట్టేలా పెర్ఫార్మన్స్ చేసిందని, తప్పకుండా ఈ మూవీ సక్సెస్ తో ఆమె ఖాతాలో మరొక విజయం ఖాయం అని బంగార్రాజు యూనిట్ ఆశాభావము వ్యక్తం చేస్తోంది. మరోవైపు తమ హీరోయిన్ తప్పకుండా బంగార్రాజుతో సూపర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడం ఖాయం అని పలువురు కృతి శెట్టి ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆమెకు ముందస్తుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మరి బంగార్రాజు తో బేబమ్మ ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుని ఆడియన్స్ ని అలరిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఓపికపట్టాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: