టాలీవుడ్ లో ప్ర‌స్తుతం అభినంద‌న‌లు, విషెష్‌లు, సారీలు చెబుకుంటున్నారు. ఇటీవ‌ల శ్యామ్‌సింగ‌రాయ్ హీరో నాని అండ్ టీమ్‌కి పుష్ప‌రాజ్ అన‌గా ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. శ్యామ్‌సింగ‌రాయ్ టీమ్ ను అభినందించే అవ‌కాశం దొర‌క‌లేదు అని.. మ‌రిచిపోయానని చెబుతూ.. నాని అండ్ టీమ్ చేసిన ప్ర‌య‌త్నానికి బ‌న్ని అభినంద‌న‌లు తెలిపారు. అదేవిధంగా నాని పెర్పామెన్స్ చాలా బాగుంది. అదేవిధంగా సాయిప‌ల్ల‌వి కూడా అద్భుతంగా న‌టించింది. ఎవ‌రైనా సినిమా చూడ‌డం మిస్ అయితే ఓటీటీలో త‌ప్ప‌కుండా చూడండి అని వెల్ల‌డించారు అల్లుఅర్జున్‌.

టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇవాళ త‌న 52వ పుట్టిన రోజు వేడుక‌ను జ‌రుపుకుంటున్నారు. సుకుమార్ బ‌ర్త్‌డే విషేస్‌తో ట్విట్ట‌ర్‌లో మారు మ్రోగిపోయింది.అభిమానుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు కూడా సుకుమార్‌కు బ‌ర్త్‌డే విషెష్ తెలిపారు. ఇప్ప‌టికే ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన రామ్ చ‌ర‌ణ్‌, అల్లుఅర్జున్, రామ్ వంటి హీరోలు ఈ గ‌ణితం మాస్ట‌ర్‌కు త‌మ‌దైన రీతిలో శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక‌ముందు ప‌ని చేసే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అంతే స్పెష‌ల్‌గా సుకుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఒక సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిన‌దే. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌తో పుష్ప ది రూల్ త‌రువాత సుకుమార్ విజ‌య్‌తో సినిమా ప్రారంభించ‌నున్నారు.

అప్ప‌టిలోగా విజ‌య్ లైగ‌ర్ షూటింగ్‌ను పూర్తి చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని కూడా విజ‌య్ త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చాడు. ముఖ్యంగా సుకుమార్ సార్ కి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. మీతో సినిమా చేయ‌డానికి ఎదురు చూడ‌లేక‌పోతున్నాను. 2021లో దిరైజ్‌, 2022లో ది రూల్‌, 20223లో ది ర్యాంపేజ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్‌గా మారినది. ర్యాంపేజ్ క‌థ‌తో విజ‌య్ ని ఏ రేంజ్‌లో చూపించ‌నున్నాడో అని అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తూ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: