త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినికాంత్ అల్లుడు ధ‌నుష్ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ధ‌నుష్ త‌మిళంలో న‌టించిన సినిమాలు తెలుగులో కూడా విడుద‌ల‌వుతూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగులో మారి, మారి 2 సినిమాలు మంచి విజ‌యం ద‌క్కించుకున్నాయి. ఇదిలా ఉండ‌గానే ధనుష్ స్ట్ర‌యిట్‌గానే తెలుగులో సినిమాలు చేస్తున్న విష‌యం విధిత‌మే. తెలుగులో డైరెక్ట్‌గా రెండు సినిమాలు చేస్తున్నాడు ఈ త‌మిళ స్టార్ హీరో. అందులో ఒక‌టి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మ‌రొక‌టి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో అయితే వీటిలో వెంకీ అట్లూరి సినిమా త్వ‌ర‌గా రానున్న‌ది.

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా మొద‌లు పెట్టారు. తొలిప్రేమ‌, మిస్ట‌ర్ మ‌జ్ఞు, రంగ్‌దే వంటి సినిమాల‌తో ఆక‌ట్టుకున్న వెంకీ అట్లూరి ఇప్పుడు ధ‌నుష్ కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌ను చేశాడ‌ట‌. ఈ సినిమాకు సార్ అనే టైటిల్‌కు కూడా ఫిక్స్ చేశారు. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్య‌క్ర‌మాలు హైదాబాద్‌లో  కూడా జ‌రిగాయి.  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ క్లాప్ కొట్ట‌గా .. షూటింగ్  ప్రారంభ‌మైంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళంలో కూడా ఏక‌కాలంలో నిర్మిస్తున్నార‌. ధ‌నుష్‌కు జోడిగా కోలీవుడ్ బ్యూటీ సంయుక్త మీన‌న్ న‌టిస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే.  సంయుక్త ఇప్ప‌టికే భీమ్లానాయ‌క్ చిత్రంలో రానాకు జంట‌గా న‌టించి.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ లెక్క‌న సార్ సంయుక్త‌కు రెండ‌వ తెలుగు సినిమా అని చెప్ప‌వ‌చ్చు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ రూమ‌ర్ ఫిలిం ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన సంయుక్త‌మీన‌న్ త‌ప్పుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మేక‌ర్స్ మ‌రొక‌ హీరోయిన్ కోసం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు అనే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రొక హీరోయిన్ కోసం వెతుకుతున్న మాట వాస్త‌వ‌మే. కానీ సంయుక్త మీన‌న్ తొల‌గించారా లేదా అన్న‌ది మాత్రం తెలియాల్సి ఉంది. సంయుక్త స్థానాన్ని మార్చ‌డం కోసం మ‌రొక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు అనే ప్ర‌ధానంగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

 అస‌లు విష‌యం ఏమిటంటే ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ కావాల్సి ఉంద‌ట‌. సంయుక్త  మ‌రొక హీరోయిన్  కూడా న‌టిస్తుండ‌టంతో ఆ హీరోయిన్ కోసం మేక‌ర్స్ వెతుకుతున్నార‌ని స‌మాచారం. సంయుక్త త‌న సోష‌ల్ మీడియాలో హ్యాండిల్స్‌లో కూడా సార్ చిత్రానికి సంబంధించిన అఫ్‌డేట్స్‌ను డిలీట్ చేయ‌లేదు. ఇది కేవ‌లం పుకారు మాత్ర‌మేన‌ని వాద‌న వినిపిస్తోంది. ఇంత‌కు సంయుక్త సార్‌లో న‌టిస్తుందా..?  లేదా అనేది మాత్రం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి మ‌రీ.


మరింత సమాచారం తెలుసుకోండి: