మాస్ మహారాజా రవితేజ కొన్ని కొంతకాలం క్రితం వరకు వరుస ప్లాప్ లతో డీలా పడిపోయి ఉన్నాడు,  అలాంటి సమయం లోనే రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లను కూడా సాధించింది,  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో  రవితేజ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్నాడు,  అందులో భాగంగా రవితేజ నటించిన ఖిలాడి సినిమా ఈ మధ్యనే థియేటర్ లలో విడుదల అయ్యింది,  ప్రస్తుతం కూడా ఈ సినిమా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

 ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ , శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమాను మార్చి 25 వ తేదీన గాని ఏప్రిల్ 15 వ తేదీన గాని విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది,  ఈ మూవీ లో రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్ , రజీషా విజయన్ హీరోయిన్ లుగా అలరించనున్నారు, ఈ మూవీ కి సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ సినిమా తో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం, ఈ మూవీ లో మరి కొన్ని ముఖ్యమైన పాత్రల్లో  నాజర్,  నరేశ్,  పవిత్ర లోకేశ్ కనిపించనున్నరు,  రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ పవర్ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.  రవితేజ ఈ సినిమాలతో పాటు ధమాకా, రావణాసుర , టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: