సాహో సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్నా దర్శకుడు సుజిత్ కి అది కమర్షియల్ సక్సెస్ సాధించాక పోవడం తో ఒక్కసారిగా ఆయనకు వచ్చిన స్టార్డం అంతా పడిపోయిందని చెప్పాలి. సినిమా సంగతి పక్కన పడితే అయన దర్శకుడిగా అంతకు మంచి సినిమా చేశాడు. అది చూసి అయినా ఆయనకు మంచి అవకాశాలు రావాల్సి ఉంది. కనీ తదుపరి సినిమా చేయడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడో తెలియదు కనీ సుజిత్ మాత్రం మరొక సినిమా ను పట్టుకోలేకపోయాడు.

వాస్తవానికి చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా చేయడానికి మొదటగా ఈ దర్శకుడికే ఛాన్స్ వచ్చింది. అయితే స్క్రిప్ట్ లో చాలా లోపాలు ఉండడం తో అయన తో సినిమా ను క్యాన్సల్ చేశాడు చిరు. ఆ తర్వాత ఈ సినిమా మోహన్ రాజా కి వెళ్ళింది. షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. అయినా సుజిత్ తదుపరి సినిమా విషయంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడో తెలియదు కానీ అయన అభిమానులు మాత్రం అయన తదుపరి ఏ సినిమా చేస్తాడో అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సుజిత్ చిన్న హీరోల సినిమాల అవకాశాలు వస్తే పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాడని, పెద్ద హీరోల డేట్స్ కోసం ఎదురుచూసి సమయాన్ని వృధా చేస్తున్నాడని తెలుస్తుంది. ఏ దర్శకుడైనా ముందు చిన్న హీరోలతో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత పెద్ద హీరోలతో చేస్తాడు. కానీ ఈ దర్శకుడు పెద్ద హీరో తో చేశాడు. మళ్ళీ పెద్ద హీరో కోసమే ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వారు ఒప్పుకుని సమయంలో చిన్న హీరో తో ముందుకు వెళితే మంచిదని కొంతమంది సలహా ఇస్తున్నాడు. మరి సుజిత్ ఈ విషయం తగ్గి తదుపరి సినిమా అవకాశం అందుకుంటాడా చూడాలి. అయన బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేసే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: