ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సెన్సేషనల్ హిట్ కాగా దానికి కొనసాగింపుగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 వచ్చింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

గరుడని చంపి కె.జి.ఎఫ్ ని తన ఆదీనంలోకి తెచ్చుకున్న రాకీ (యశ్) తిరుగులేని విధంగా తయారవుతుండగా గరుడ తమ్ముడు అథీరా (సంజయ్ దత్) తన దారికి అడ్డు పడతాడు.. పి.ఎం రమిక సేన్ (రవీనా టాండన్) కూడా రాకీ సామ్రాజ్యాన్ని కూల్చాలని చూస్తుంది. ఇంతకీ వీళ్ల ప్రయత్నాలు ఏమయ్యాయి.. రాకీ చివరకు ఏమయ్యాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సూపర్ హిట్ కాగా ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా హీరో ఎలివేషన్, టైట్ స్క్రీన్ ప్లే, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆకట్టుకునే సినిమాటోగ్రఫీతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 వచ్చింది. సినిమా చూసే ఆడియెన్స్ అందరిని తన మాయలో పడేశాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్.

కె.జి.ఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపుగా దానికి పర్ఫెక్ట్ సీక్వెల్ గా చాప్టర్ 2 వచ్చింది. సినిమాలో కథ పెద్దగా లేకపోయినా దాన్ని నడిపించిన తీరు మెప్పించింది. ఇక మాస్ ఆడియెన్స్ కి నచ్చే అంశాలు.. రోమాలు నిక్కబొడుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కె.జి.ఎఫ్ మ్యాజిక్ ని మళ్లీ ఈ పార్ట్ 2 లో కూడా కొనసాగేలా చేశాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్.

సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్ కూడా ఊగిపోయేలా చేశాడు. ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయ్యేలా మొదటి సన్నివేశం నుండే డైరక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కె.జి.ఎఫ్ చాప్టర్ 1కి ఇది పర్ఫెక్ట్ సీక్వల్ గా వచ్చి మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఎంత పెద్ద మాస్ సినిమా అయినా మదర్ సెంటిమెంట్ ని మేళవించి డైరక్టర్ ప్రశాంత్ నీల్ తన అద్భుతమైన ప్రతిభ కనబరించాడని చెప్పొచ్చు.

నటీనటుల ప్రతిభ :

పార్ట్ 1 లో లానే యశ్ తన మేనరిజం, స్టైల్ తో ఆకట్టుకున్నాడు. రాకీ పాత్రలో యశ్ తన స్టామినా చూపించాడని చెప్పొచ్చు. శ్రీనిధి శెట్టి కూడా అలరించింది. సినిమాలో అథీర పాత్ర మీద భారీ అంచనాలు పెట్టుకోగా అది కాస్త అంచనాలను అందుకోలేదని చెప్పొచ్చు. ఇక రవీనా టాండన్ పాత్ర ఉన్నంతవరకు పవర్ ఫుల్ గా బాగా అనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్, రావు రమేష్ పాత్రలు అలరించాయి. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు రవి బస్రూర్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. మ్యూజిక్ తర్వాత సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. కెమెరా వర్క్ చాలా బాగుంది. డైరక్షన్ ప్రశాంత్ నీల్ మరోసారి తన సత్తా చాటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

యశ్

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

యాక్షన్ పార్ట్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

విలనిజం

లాజిక్ లేని కొన్ని సీన్స్

బాటం లైన్ :

కె.జి.ఎఫ్ 2.. అంచనాలకు తగినట్టుగానే..!

రేటింగ్ : 2.75/5

మరింత సమాచారం తెలుసుకోండి: