నాగ చైతన్య ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. పోయిన ఏడాది లవ్ స్టోరీ సినిమా తో, ఈ ఏడాది ఆరంభంలో బంగార్రాజు సినిమా మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు మరికొన్ని క్రేజీ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతు నటించిన థాంక్యూ సినిమా ఇప్పుడు విడుదల కు సిద్ధంగా ఉంది. జులై లో ఈ సినిమా విడుదల కానుంది. ఎంతో వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది అన్న నమ్మకంతో నాగచైతన్య ఉన్నాడు.

ఇక బాలీవుడ్ లో నాగ చైతన్య తెరంగేట్రం చేస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా.. అమీర్ ఖాన్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు లో విడుదల కాబోతుండగా ఈ సినిమా లో చైతు కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా మార్కెట్ లో మార్కెట్ సంపాదించుకోవాలని చూస్తున్నాడు చైతు. ఈనేపథ్యంలో ఈ సినిమా చైతు కి ఏ స్థాయి లో విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా యొక్క ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పరిచిండి

ఇక చైతు చేయబోతున్న మరో భారీ ప్రాజెక్ట్ దూత అనే వెబ్ సిరీస్. ఈ వినూత్నమైనకాన్సెప్ట్ ని విక్రమ్ కుమార్ తెరకెక్కుస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమ్ అవనుంది. అయితే వీటితో సరిపెట్టుకోకుండా ఈ ఏడాది మరో సినిమా ను మొదలుపెట్టబోతున్నాడు నాగ చైతన్య. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రానికి చైతన్య శ్రీకారం చుట్టాడు. ఇంకా పరశురామ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ కనకమేడల తో ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఇంతమంది తో సినిమా ఒకే చేసుకున్న చైతు వాటితో ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: