మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన మూవీ ఆర్ ఆర్ ఆర్. యస్ యస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చిలో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇతర దేశాల్లో కూడా విదేశీయులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. సోషల్ మీడియా వేదికగా బాగా ప్రచారం కూడా చేశారు. అమెరికన్ లు సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ట్రిపుల్ ఆర్ ఓ అద్భుతమైన సినిమా అని దీన్ని తప్పకుండా అంతా చూడాలని కూడా బాగా ప్రచారం చేశారు. ఇప్పటికీ కూడా చేస్తున్నారు.ఈ మూవీ ఇటీవలే ఓటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని చూసిన వారంతా కూడా సినిమా అద్భుతంగా వుందని ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. థియేట్రికల్ రన్ ముగిసినా కానీ నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీకి లభిస్తున్న ఆదరణ అయితే అసలు అంతా ఇంతా కాదు. విదేశీయులు ఈ మూవీపై ఊహించని విధంగా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. 


ఇటీవల ఓ హాలీవుడ్ నటుడు అయితే ప్రశంసలు కురిపిస్తూ ప్రచారం చేయగా.. తాజాగా హాలీవుడ్ క్రేజీ మూవీ `డాక్టర్ స్ట్రేంజ్` ఫిల్మ్ రచయిత కూడా మూవీపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.ఇక ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీని encoRRRe మళ్లీ విడుదల చేశారు. రెస్పాన్స్ చాలా అద్భుతంగా వుంది. హాలీవుడ్ సినిమాల తరహాలో ఈ ట్రిపుల్ ఆర్ క్రేజ్ థియేటర్ల వద్ద కనిపిస్తోంది. అయితే ఈ సినిమా పూర్తి సక్సెస్ క్రెడిట్ ని మాత్రం బాలీవుడ్ ఖాతాలో వేస్తున్నారట.ఇండియన్ సినిమాలంటే విదేశీయుల్లో బాలీవుడ్ సినిమా అనే అపోహ కూడా వుంది. అదే ట్రిపుల్ ఆర్ సినిమా క్రెడిట్ ని బాలీవుడ్ ఖాతాలో వేస్తోందట. ఇది తెలుగు సినియా అని తెలియక హిందీ వెర్షన్ చూస్తున్న వారు మాత్రం ఇది బాలీవుడ్ మూవీ అంటూ బాగా ప్రశంసలు గుప్పిస్తుండటం మన వాళ్లకు తెగ చిరాకు పుట్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR