యంగ్ హీరోలలో నిఖిల్ చాల డిఫరెంట్ జోనర్ సినిమాలను చేస్తూ ఉంటాడు. అయితే గతకొంత కాలంగా ఇతడి సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఇలాంటి పరిస్థితులలో నిఖిల్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘కార్తికేయ 2’ మూవీ ట్రైలర్ చూసినవారు ఈ మూవీ నిఖిల్ కు మళ్ళీ కెరియర్ బ్రేక్ ఇస్తుందా అన్న సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.



మూఢనమ్మకాలు చుట్టూ తిరిగే కథలు వాటి వెనుక ఉన్న సంఘటనలు ఆధారంగా చేసుకుని తీసిన సినిమాలు గతంలో చాల వరకు హిట్ అయ్యాయి. ఇలాంటి సినిమాలలో నటించడంలో నిఖిల్ కు మంచి అనుభవం ఉంది. గతంలో తనకు హిట్ ఇచ్చిన ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్ గా ఈమూవీని డిఫరెంట్ కథతో తీస్తున్నట్లుగా ఈమూవీ ట్రైలర్ ను చూసినవారికి అర్థం అవుతుంది.



ఈసినిమా పై 30 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి నిఖిల్ మార్కెట్ రీత్యా ఈ బడ్జెట్ చాల ఎక్కువ. అయితే కథ మీద నమ్మకంతో ఇంత బడ్జెట్ నిఖిల్ పై ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఈమూవీ జూలై 22న విడుదల కాబోతోంది. అయితే సోలో విడుదల అవుతుంది అనుకున్న ఈమూవీకి నాగచైతన్య నుండి పోటీ రావడం హాట్ టాపిక్ గా మారింది.



వాస్తవానికి నాగచైతన్య ‘ధాంక్యూ’ మూవీని జూలై 15న విడుదల చేద్దాం అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆమూవీని మరింత ప్రమోట్ చేసి విడుదల చేయాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీని జూలై 22న విడుదల చేస్తున్నారు. దీనితో నిఖిల్ కు చైతూ నుండి పోటీ తప్పడంలేదు. ఇప్పుడు వీరిద్దరి పోటీలో ఎవరు గెలుస్తారు అన్న విషయమై అనేక అంచనాలు ఉన్నాయి. నిఖిల్ కు ‘కార్తికేయ 2’ హిట్ చాల అవసరం. అయితే ఇప్పటికే హిట్ ట్రాక్ పై ఉన్న చైతన్యతో పోల్చుకుంటే నిఖిల్ కు తన సినిమాలకు సంబంధించి ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో వెనకపడే ఆస్కారం ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: