టాలీవుడ్ లో ఎందరో నటీ నటులుగా కెరీర్ ను స్టార్ట్ చేసి కొంతకాలం రాణించిన అనంతరం వివిధ కారణాలతో ఇండస్ట్రీకి దూరమైన వారిని చాలా మందిని చూశాము. అటువంటి వ్యక్తులలో ఒకరే హీరో తొట్టెంపూడి వేణు. ఈయన నటించిన తొలి సినిమా స్వయంవరం. ఈ సినిమా తన కెరీర్ కు అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చింది. మ్యూజికల్ గా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత చాలా సినిమాలు హీరోగా మరియు సహనటుడిగా చేశాడు. ఆ తర్వాత టాలీవుడ్ లో పోటీ పెరిగిపోయి వెనుతిరిగాడు. అప్పటి నుండి వేణు గురించి ఎటువంటి వార్త లేదు. అయితే ఇన్నాళ్ల తరువాత మళ్ళీ తాను మొఖానికి రంగు వేసుకోవడానికి సిద్ధపడ్డాడు.

అందుకు తగినట్లే వేణుకు సరైన పాత్ర దొరికింది. రవితేజ తాజాగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో వేణు నటించాడు. ఈ సినిమాలో వేణు సీఐ మురళిగా చేస్తున్నాడు. ఇటీవల వేణు లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయింది. ఇలా తన రెండవ ఇన్నింగ్స్ లో మొదటి సినిమాను పురస్కరించుకుని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన సినీ జీవితంతో పాటుగా, వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని విషయాలను తెలియచేశారు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వేణు మామయ్య మాగంటి అంకినీడు మచిలీపట్నానికి ఎంపీ గా ఉన్నారని తెలిపాడు. ఈ విషయం తెలిసిన వెంటనే వేణు రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్న అడిగారు సదరు ఇంటర్వ్యూయర్. అయినందుకు వేణు కూడా ఖచ్చితంగా నేను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని తెలిపాడు. కాగా వేణు నటించిన సినిమా ఈ వారం లోనే రిలీజ్ కానుంది. అయితే తనకు మళ్ళీ లైఫ్ ఇస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఫలితం వరకు వేచి చూడాల్సిందే. మరి చూద్దాం వేణు రాజకీయ అరంగ్రేటం ఎప్పుడు ఉండనుందో ?

 




మరింత సమాచారం తెలుసుకోండి: