నిర్మాతల మండలి ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో షూటింగ్ లు నిలిచిపోయాయి. అనేక చర్చలు జరిగిన తరువాత ఈ నిర్ణయాన్ని ఇండస్ట్రీ వర్గాలు తీసుకున్నారు. ఈ షూటింగ్ ల బంద్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియకపోయినా దీని ప్రభావం మాత్రం ముఖ్యంగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వర్కర్స్ పై పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.


కరోనా పరిస్థితులు తరువాత ఇండస్ట్రీ నెమ్మదిగా కోలుకుంటోంది అని భావిస్తున్న తరుణంలో గత రెండు నెలలుగా వస్తున్న వరస ఫ్లాప్ లతో పాటు ఇప్పుడు షూటింగ్ లు నిలుపుదల కూడ కలవడంతో ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవానికి ఈరోజు ఇండస్ట్రీని సమస్యలలోకి నెట్టింది పెరిగిపోయిన నిర్మాణ వ్యయం.


ఆ నిర్మాణ వ్యయంలో ఎక్కువగా హీరోలు హీరోయిన్స్ ఇతర కీలక నటీనటులకు ఇచ్చే పారితోషికాలు ఉంటున్నాయి. ఆవిషయం గురించి ధైర్యంగా మాట్లాడకుండా ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ శాలరీలు వర్చ్యువల్ క్యూబ్ ఛార్జస్ టిక్కెట్ల ధరలు ఓటీటీ సమస్యలు ఒకేరోజు నాలుగు ఐదు సినిమాల విడుదల అన్న విషయాల పై చర్చలు జరుపుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత మాత్రమే షూటింగ్ లు మొదలు పెడతామని నిర్మాతలు చెపుతున్నారు.


అయితే టాప్ హీరోల భారీ పారితోషికాల గురించి ఎవరు ఓపెన్ గా మాట్లాడటం లేదు. టాప్ హీరోలు పారితోషికాలు తీసుకోకుండా వారు నటించే సినిమాలలో కేవలం లాభ నష్టాలు తీసుకునే భాగస్వాములుగా ఉండటానికి అమ్గీకరిమ్చినప్పుడు మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కుంటున్న సమస్యలకు ఒక పరిష్కారం లభించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే ఈవిషయాలను టాప్ హీరోల దృష్టికి తీసుకువెళ్ళి వారిని తమ పారితోషికాల విషయాలలో తగ్గించుకోమని చెప్పే విషయాన్ని పక్కకు నెట్టి ఇలా ఎన్ని రోజులు షూటింగ్ లు బంద్ చేసినా ప్రయోజనం లేదు అంటూ ఇండస్ట్రీలో కొందరి అభిప్రాయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: