మెగా హీరోలలో ఒకరు అయిన వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుణ్ తేజ్ ఇప్పటికే కంచె , ఫిదా , తొలిప్రేమ , గద్దలకొండ గణేష్ వంటి అనేక విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా వరుణ్ తేజ్ గని , ఎఫ్ 3 మూవీ లలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి  విజయాలను అందుకోలేక పోయాయి. ఈ రెండు మూవీ లు కూడా అనుకున్న రేంజ్ విజయాలను అందుకోక పోవడంతో వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాల విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్ , ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే. కాక పోతే వరుసగా రెండు అపజయాలు రావడంతో వరుణ్ తేజ్ , ప్రవీణ్ సత్తార్ మూవీ ని కొన్ని రోజుల పాటు హోల్డ్ లో పెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అలాగే తాజాగా కార్తికేయ 2 మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించబోతున్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. తాజాగా కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో భాగంగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో చందు మొండేటి తన తదుపరి మూవీ ని చేయనున్నట్లు ప్రకటించాడు. గీతా ఆర్ట్స్ లో చందు మొండేటి తెరకెక్కించబోయే మూవీ లో వరుణ్ తేజ్ హీరోగా నటించబోతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: