టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని అఖిల్ కొంత కాలం క్రితం విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని బాక్సా ఫీస్ సొంతం చేసుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు అయినటు వంటి సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో సాక్షి వైద్య ,  అఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా , ఈ టీజర్ ఆద్యంత ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరి పోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది  ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ మూవీ ని ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాక పోతే అప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో ఈ మూవీ యూనిట్ ఆగస్టు 12 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయలేక పోయింది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త బయటకు వచ్చింది. కాగా ఈ తేదీన కూడా ఈ సినిమా విడుదల కాపడం కష్టమే అని తెలుస్తుంది. దానితో అఖిల్ హీరో గా తేరకెక్కుతున్న ఏజెంట్ మూవీ విడుదల తేదీ పై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. ఇది ఎలా ఉంటే ఏజెంట్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: