బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి , ఇప్పటికీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ తన మూవీ ల ద్వారా ఇండియా లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించి ,  ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సల్మాన్ ఖాన్ "గాడ్ ఫాదర్" అనే తెలుగు మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. గాడ్ ఫాదర్ మూవీ లో చిరంజీవి హీరోగా నటించగా ,  మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయ్యి ,  బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది.

మూవీ లో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నశించిన కారణంగా ,  ఈ మూవీ కి హిందీ పరిశ్రమ నుండి కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి. అలాగే గాడ్ ఫాదర్ మూవీ లోని సల్మాన్ ఖాన్ పాత్ర కు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ "కిసీ కా భాయ్ .. కిసీ కా జాన్" అనే మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ లో బాక్సర్ ఒలింపిక్స్ పతాక విజేత అయినటు వంటి విజేందర్ సింగ్ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రకటించాడు. ఇలా ఉంటే ఈ మూవీ లో వెంకటేష్ , జగపతి బాబు కూడా నటిస్తున్నారు. ఈ మూవీ ని 21 ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: