మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ యంగ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందD మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. కాకపోతే ఈ మూవీ లో శ్రీ లీల తన నటనతో , అందచందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేయడం తో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఇచ్చిన ఒకే ఒక్క మూవీ తో అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది. 

దానితో ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం శ్రీ లీల , రవితేజ హీరోగా తెరకెక్కిన ధమాకా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతోంది. ప్రస్తుతం శ్రీ లీల , రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ కు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ లభించే అవకాశం ఉంది. 

ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ లీల ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ , తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా తన ఇన్స్టా లో శ్రీ లీల కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ లీల తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: