తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి తాప్సి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఝుమ్మంది నాదం మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది.

ఝుమ్మంది నాదం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ లో తాప్సీ తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా , తన అందచందాలను ఓ లకబోయడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలు లభించాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ , రవితేజ , వెంకటేష్ వంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న తెలుగు హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగింది.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తాప్సి ఎక్కువ శాతం హిందీ మూవీ లలో నటిస్తూ వస్తుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగు లో తాప్సి "మిషన్ ఇంపాజిబుల్" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. తాప్సి ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా తాప్సి కి "ఓ టి టి" విభాగంలో ఉత్తమ నటి అవార్డు లభించింది. "ఓ టి టి" విభాగంలో ఫిలిం ఫేర్ అవార్డ్  లలో భాగంగా "లూప్ లపేట" మూవీ లోనీ అద్భుతమైన నటన కు గాను తాప్సి కి వెబ్ ఒరిజినల్ ఫిలిం క్యాటగిరి లో ఉత్తమ నటి అవార్డు దక్కింది. ప్రస్తుతం కూడా తాప్సి వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: