ఎవరైనా సరే అధిక మొత్తంలో డబ్బులు పొందాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నట్టుగానే షేర్ మార్కెట్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఎవరైనా సరే అతి తక్కువ సమయంలో లక్షల రూపాయలు సంపాదించాలి అంటే అందుకు ఉన్న ఏకైక మార్గం షేర్ మార్కెట్.. షేర్ మార్కెట్ లో డబ్బులు రెట్టింపు అవుతాయా అంటే చెప్పలేని పరిస్థితి.. నిజానికి షేర్ మార్కెట్ లో ఊహించని విధంగా రిస్క్ ఉంటుంది కాబట్టి.. ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాని సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.ఇక అంతే కాదు ఈ స్టాక్ మార్కెట్ లో డబ్బు ఇన్వెస్ట్ చేయడం వల్ల అదృష్టం ఉంటే కచ్చితంగా ఊహించని విధంగా రూ.లక్షకు రూ. 90 లక్షల వచ్చే అవకాశం కూడా ఉంటుందట.

ఇప్పటికే షేర్ మార్కెట్లో ఎన్నో షేర్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. మరిముఖ్యంగా మల్టీ బ్యాగర్ షేర్లలో మనం కనుక డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా కళ్లుచెదిరే రాబడి వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వాటిలో హైదరాబాద్ కేంద్రంగా పలు సేవలు అందిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అయినటువంటి బ్రైట్  కమ్ గ్రూప్ షేర్ కూడా ఒకటి. ఈ షేర్  ప్రస్తుతం ఇన్వెస్టర్లకు భారీ లాభాలను ఆర్జించి పెట్టింది. అంతేకాదు గత మూడు సంవత్సరాల క్రిందట ఈ షేర్ లో డబ్బులు పెట్టిన వారికి ఇప్పుడు ఏకంగా 90 లక్షల రూపాయలు వచ్చాయట. దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం..

ఇకపోతే గత మూడు సంవత్సరాల క్రితం ఈ షేరు ధర రూ.2.16 ఉండగా ప్రస్తుతం దీని ఒక్కొక్క షేర్ విలువ రూ.195 కు పెరిగింది. అంటే ఇందులో ఇన్వెస్టర్లకు తొమ్మిది వేల శాతం రాబడిని అందించింది అని చెప్పుకోవచ్చు. ఇక గత మూడు నెలల కాలంలోనే ఈ కంపెనీ యొక్క చేరు ఐదు కోట్లకు పైగా పెరగడం గమనార్హం. అంటే ఉదాహరణకు ఈ నీలో మీరు మూడు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుతం మీ ఇన్వెస్ట్మెంట్ ఏకంగా రూ.90 లక్షలకు పైగా ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: