టాలీవుడ్ లో శ్రీ రెడ్డి చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో జాతీయ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది. ఎటువంటి విషయం మీదనైనా పచ్చిగా మాట్లాడే శ్రీ రెడ్డి, ఈసారి తనమీద తనే అనుచిత వ్యాఖ్యలు చేసుకుంది.

చాలా సందర్భాల్లో మెగా సెలెబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అయితే ఈ సారి తాజాగా పెళ్ళిపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. పెళ్ళి తనకి సూట్ కాదని, అటువంటి లైఫ్ తనకి నచ్చదని తెగేసి చెప్పింది.

తన మైండ్ సెట్ ప్రకారం తనకి పెళ్ళి సూట్ అవదని, విచ్చలవిడిగా ఉండడమే తనకి కరెక్ట్ అని చెప్పింది. డేటింగ్ విషయంలోనూ తనకి చాలా క్లారిటీ ఉందని, ఏడాది పాటు డేటింగ్ లో ఉండటమే చాలా ఎక్కువని, ఆ తర్వాత కొత్త పార్ట్ నర్ ని వెతుక్కుంటానని కుండ బద్దలు కొట్టింది.

తను ఫ్యామిలీ టైప్ కాదని, ఫ్లే గర్ల్ గా ఉండడమే తనకి నచ్చుతుందని, అలాంటి జీవితాన్నే తాని ఎంజాయ్ చేస్తానని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: