ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు అని అందరికి తెలిసిందే కదా. ఈ సినిమా కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా గెటప్ లోకి  మారిపోయాడు. ఇక  ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా కదా. ఇప్పటికే దసరా సందర్భంగా  విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్‌ చాల మంచి రెస్పాన్స్ వచ్చింది అని అందరికి తెలిసింది. 


తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జెమిని టీవీ భారీ రేటుకు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ ‘రూలర్’ అని జెమిని టీవీ వారు కన్ఫామ్ చేయడం జరిగింది. ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ కాకుండా... జెమిని టీవీ కన్ఫామ్ చేయడాన్ని చూసి చిత్ర వర్గాలు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా బాలకృష్ణ కొత్త సినిమాకు ‘రూలర్’ టైటిల్ చూసి బాలయ్య అభిమానులు మాత్రం  పండగ చేసుకుంటున్నారు. 


ఇక  ఈ సినిమాకు ‘రూలర్’ అనే టైటిల్‌తో పాటు  ‘క్రాంతి’, ‘జడ్జిమెంట్’, ‘డిపార్ట్‌మెంట్’ అనే టైటిల్స్ కూడా పరిశీలించడం జరిగింది. మొత్తానికి బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టు ఈ  సినిమాకు ‘రూలర్’ టైటిల్ కన్ఫామ్ చేయడం జరిగింది జెమిని టీవీ వాళ్ళు.


మొత్తానికి  బాలకృష్ణ కొత్త  సినిమాకు ఏ టైటిల్ పెడతారన్నదానికి పులిస్టాప్ పెట్టారనేది అర్థం అవుతుంది.  ఈ సినిమా తాజాగా షెడ్యూల్ ఈనెల 18 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అవుతుంది అని తెలిపారు చిత్ర యూనిట్. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా పాత్ర పోషిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలనీ అనుకుంటున్నారు చిత్ర యూనిట్. ఇక  ఉపగ్రహ హక్కులను జెమిని టీవీ సొంతం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: