ప్రతిరోజూ పండగే చిత్రం ప్రీ రిలీజే వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. సినిమా పేరుకి తగ్గట్లుగానే చిత్ర బృందం ఈ వేడుకలో ఎంతో సంతోషంగా కనిపించారు. సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, విజయ్ కుమార్, నరేష్, రావు రమేష్, ప్రభ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర బృందం చేసిన సందడి అంతా ఇంతా కాదు. స్టేజి పైనే సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, మారుతీ, తదితరులు డాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. అయితే ఈ చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ చేత డాన్స్ వేయించారు హీరో సాయి ధరమ్ తేజ్.

 

అయితే అల్లుఅరవింద్ డాన్స్ సూపర్ అంటూ ప్రేక్షకులు ఆ వీడియో ని తెగ షేర్ చేస్తున్నారు. సత్యరాజ్, నరేష్ లతో చేసిన అల్లు అరవింద్ డాన్స్ ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక లో హైలెట్ అని చెబుతున్నారు. ఈ చిత్రం ఈ నెల 20 న విడుదలకి సిద్ధంగా వుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించగా, మారుతీ దర్శకత్వం వహించారు.స్టేజ్ మీద ప్ర‌తి ఒక్క‌రూ డ్యాన్స్ వేస్తూ వారి ఆనందాన్ని పంచుకున్నారు. అదిక పండ‌గ‌లాగా చేసి ఫ్యాన్స్‌కు పండ‌గ వాతావ‌రణాన్ని కల్పించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో...

 

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ...మా ఫంక్షన్ కు వచ్చిన అందరికీ థాంక్స్. ఫ్యాన్స్ ఉంటే మాకు ప్రతిరోజు పండగే. నాకు ఎప్పుడూ అండగా నిలబడింది మెగా ఫ్యాన్స్, వారందరు గర్వపడాలి నేను సినిమాలో సిక్స్ ప్యాక్ చేశాను. మారుతి గారు నాకోసం అదిరిపోయే స్క్రిప్ట్ చేశారు. సినిమా చూశాక మీకు అర్థం అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తో పాటు అభిమానుల బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్న. తమన్ నాకోసం మంచి సాంగ్స్ ఇచ్చాడు. సినిమా చూశాక ఆడియన్స్ నిరుత్సాహ పడరనే నమ్మకం ఉంది. ఐదేళ్ల క్రింద పిల్లా నువ్వులేని జీవితం విడుదలయ్యింది, మళ్ళీ ఇప్పుడు అరవింద్ గారితో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ సమయంలో బాగా ఎంజాయ్ చేస్తూ చేశాం. సినిమా తప్పకుండా మీకు నచ్చుతుందని భవిస్తున్నాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: