ప్రస్తుతం బాలీవుడ్‌ లో డాన్సింగ్ దివాగా పేరు తెచ్చుకున్న మలైకా అరోరా తన కెరీర్‌ స్టార్టింగ్‌ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అందరు న్యూ కమర్స్‌ లాగానే ఆమె కూడా ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యింది. ఆ రోజులను గుర్తు చేసుకున్న సెక్సీ బ్యూటీ మలైకా భావోద్వేగానికి లోనైంది. `నాకు ఇప్పటికీ గుర్తుంది నేను కెరీర్ స్టార్టింగ్‌లో ఆడిషన్స్‌కు వెళ్లిన రోజులు. అప్పుడు మా అమ్మ నాకు తోడుగా వచ్చేది. నాకు తొలి ప్రయ్నతంలోనూ రిజెక్షన్‌ ఎదురైంది.

 

కానీ ఆ తిరస్కరణ కారణంగా నేను నిరాశ చెందలేదు. ఎప్పుడు నా ప్రయత్నాలను విరమించలేదు. ఆ వంతు ప్రయత్నం నేను చేస్తూనే వచ్చాను. నేను మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన సమయంలో నా వయసు 17 సంవత్సరాలు. ఒక్కో రోజు ఎదుగుతూ వస్తూ ప్రస్తుతం నేను ఉన్న ఈ స్ధాయికి చేరుకునేందుకు నేను ఎంతో కష్టపడ్డాను. ఒకప్పుడు షోలో అవకావం ఎదురు చూసిన నేను ప్రస్తుతం ఓ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాను.

 

ఈ ప్రయాణం అంత సులభంగా ఏమీ జరగలేదు. నేను 15, 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు నా భవిష్యత్తు మీద ఎలాంటి అవగాహనా లేదు. కానీ ఈ జనరేషన్‌ పిల్లలు చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్లు ఆడిషన్స్‌కు వచ్చే సమయంలోనే ఏం కావాలో నిర్ణయించుకొని వస్తున్నారు. నేను నా టీన్‌ ఏజ్‌లో లెవిస్‌తో ఇన్సిస్టిట్యూట్‌లో డ్యాన్స్‌ నేర్చుకోవడానికి జాయిన్‌ అయ్యాను.

 

20 ఏళ్ల తరువాత ఇప్పుడ అదే లెవిస్‌తో కలిసి ఓ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాను` అన్నారు. ఇండియాస్‌ బెస్ట్ డ్యాన్సర్‌ కార్యక్రమంలో టెరెన్స్‌, గీతా కపూర్‌లతో కలిసి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు మలైకా.ఈ కార్యక్రమం ఫిబ్రవరి 29 సోనీ టీవీలో ప్రసారం కానుంది. ఆ షో ద్వారా 18 నుంచి 30 ఏళ్ల్ వయసున్న డ్యాన్సర్లు పరిచయం కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: