మెగాస్టార్ చిరంజీవికి, రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎగ్గొట్టాడా..? తండ్రికి, మెగా వారసుడు ఇందుకే సారీ చెబుతున్నాడా..? ఆ నష్టాల వల్లే చెర్రీ, చిరుకి పారితోషికం బాకీ పడ్డాడట. ఖైదీ భారీ లాభాలు, సైరా ఊడ్చేసిందని టాక్. ఆ నష్టాలను భర్తీ చేసేందుకు చెర్రీ కొత్త ప్లాన్స్ వేస్తున్నట్టు సమాచారం. 

 

ఖైదీ నెంబర్ 150తో రామ్ చరణ్ తండ్రి చిరంజీవిని గ్రాండ్ రీ లాంఛ్ చేశాడు. ఆ మూవీ బంపర్ ఆఫర్ హిట్ కొట్టడంతో తండ్రితో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. మరి తండ్రే కదా అని చరణ్, చిరంజీవికి రెమ్యునరేషన్ ఇస్తున్నాడా లేదా అనేది అందరిలో ఓ డౌట్ ఉంది. అయితే రామ్ చరణ్, చిరంజీవికి ఖైదీ నెంబర్ 150కోసం భారీ రెమ్యునరేషన్ ఇచ్చాడట. కానీ సైరాకు మాత్రం ఈ మెగా వారసుడు పారితోషికం ఇవ్వలేకపోయినట్టు తెలుస్తోంది. 

 

సైరా విషయమై నిర్మాత రామ్ చరణ్ రీసెంట్ గా ఓ వేదికపై కాస్త ఎమోషన్ గానే మాట్లాడాడు. నాన్న రూపాయి పారితోషికం తీసుకోకుండా నటించాడని.. సైరాను ఓ కళాఖండంగా బహుమతి ఇవ్వాలని ఆశపడ్డానని చెర్రీ చెప్పాడు. ఏం ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనని చరణ్ ఉద్వేగంగా మాట్లాడాడు. సైరా చిరంజీవి స్పెషల్ మూవీగా నిలచిన బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయం సాధించలేదు. 

 

సైరా సినిమాకు లాభాలు రాలేదు కాబట్టి చిరంజీవి పారితోషికం ఇవ్వలేదనేది అర్థమవుతోంది. అయితే సైరా నష్టాల్ని పూడ్చేందుకు చరణ్ మాస్టర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇక నుండి తండ్రి సినిమాలను ఒక్కడే కాకుండా పార్టనర్ షిప్ లో నిర్మించేలా ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే కొరటాల శివతో చేసే సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు వినికిడి. రామ్చ రణ్ వేసిన ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: