కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా 60 దేశాలు ఈ మహహ్మారి బారిన పడి విలవిల లాడుతున్నాయి. ఇంత వరకు ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు ఎలాంటి మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ అందుబాటులో లేకపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా మెడికల్‌ ఎమర్జెన్సీ విధించినట్టైంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి దాదాపు 3000 వేల మంది ప్రాణాలు విడిచారు. లక్షమంది వరకు వైరస్‌ సోకి చికిత్స పొందుతున్నారు.

 

అయితే వైరస్‌ ప్రభావం సాధారణ జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికూ చైనా ఆర్ధిక వ్యవస్థతో పాటు వ్యాపర రంగం కూడా కుదేలైపోయింది. ఇప్పుడు ఆ ప్రభావం ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సినిమాలకు చైనా అతి పెద్ద మార్కెట్. హాలీవుడ్ సినిమాలు కూడా చైనా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాలను విడుదల చేస్తుంటారు. అయితే ఇప్పుడు చైనా కరోనా కోరాల్లో చిక్కుకోవటంతో పలు హాలీవుడ్ చిత్రాల దర్శక నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు.

 

ఇప్పటికే జేమ్స్‌ బాండ్‌ సిరిస్‌లోని తాజా చిత్రం నో టైం టు డై చిత్రీకరణ పూర్తయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ముందుగా సమ్మర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ ఆ లోగా కరోనా ప్రభావం తగ్గుందన్న నమ్మకం లేకపోవటంతో సినిమా విడుదలను వాయిదా వేశారు చిత్రయూనిట్. ఏకంగా ఈ ఏడాది చివర్లో నవంబర్‌ లో సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్ణయించినట్టుగా ప్రకటించారు. ఇటీవల చైనాలో నిర్వహించాల్సిన ఈ సినిమా ప్రీమియర్‌ను కూడా చిత్రయూనిట్ క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: