ప్రపంచ దేశాలను కరోనా భయపెడుతోంది. ఇప్పటికే దాదాపు 90 దేశాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్‌ అత్యంత వేగంగా ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తుండటంతో పబ్లిక్ గేదరింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఇంటర్‌ నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ అవార్డ్స్‌ ఫంక్షన్‌ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ వేడుకల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ నెలాఖరున జరగాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని కరోనా ప్రభావం కారణంగా వాయిదా వేస్తున్నట్టుగా నిర్వహకులు పేర్కొన్నారు.

 

శుక్రవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన నిర్వాహకులు కొత్త డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. `ఐఫా 2020 వాయిదా పడింది. కోవిడ్‌ 19 వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఐఫా అభిమానుల ఆరోగ్యం, రక్షణను దృష్టిలో పెట్టుకొని జనవరల్‌ కమిటీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సినీ ఇండస్ట్రీ ప్రముఖులను సంప్రదించి కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. కార్యక్రమం తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో త్వరలోనే వెల్లడిస్తాం` అంటూ ప్రకటన విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా అభిమానులకు ఐఫా నిర్వహకులు క్షమాపణలు తెలియజేశారు. ప్రపంచ దేశాల నుంచి ఐఫాలో పాల్గొనేందుకు రావాలని ప్లాన్‌ చేసుకున్న చాలా మంది నిరాశకలిగించాం. కానీ అందరి రక్షణ, ఆరోగ్యం విషయంలో ఐఫా ఎప్పుడు అలర్ట్‌గా ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. ఈ సారి ఐఫా కార్యక్రమానికి సల్మాన్‌ ఖాన్ వ్యాఖ్యతగా వ్యవహరించాల్సి ఉంది. తన స్వస్థలం ఇండోర్‌లో జరుగుతున్న కార్యక్రమం కావటంతో హోస్ట్ చేసేందుకు అంగీకరించాడు సల్మాన్‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

We will be back with new plans in Madhya Pradesh! . Please take the necessary precautions and stay safe. . #IIFA #IIFA2020

A post shared by IIFA Awards (@iifa) on

మరింత సమాచారం తెలుసుకోండి: