తమిళనాడు రాజకీయాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. రజినీకాంత్ ఎప్పుడో తమిళ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే మరోపక్క మాత్రం రజనీకాంత్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ కుర్ర హీరోల కంటే స్పీడ్ గా ఉన్నారు. అయితే మరోపక్క తమిళనాడులో రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి మరో ఏడాది ఉంది. ఇటువంటి తరుణంలో రజనీకాంత్ సినిమాలు చేసుకుంటూ...తన పార్టీ గురించి గానీ పార్టీ కార్యకలాపాలు గురించి ఏ మాత్రం మొన్నటివరకు మౌనం వీడలేదు. పార్టీ పై స్పష్టత కూడా ఇవ్వలేదు.

 

ఇలాంటి సమయంలో అభిమానులంతా కన్ఫ్యూజన్ గా ఉన్న టైంలో ఇటీవల చెన్నైలో రజినీ మక్కల్ మండ్రమ్ ఆఫీస్ బేరర్లతో రజినీకాంత్ సమావేశమయ్యారు. కానీ ఈ సమావేశం అనంతరం పార్టీ పేరు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారనే విషయాలను మాత్రం రజినీ చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి తానెందుకు వస్తున్నట్లు అన్న విషయం పై క్లారిటీ ఇచ్చారు. రాజకీయ పార్టీలో యువరక్తం ఉండాలని అదేవిధంగా ఒక వ్యక్తి కింద పెత్తనం లేకుండా చేయటం కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అధికారంలోకి వస్తే పార్టీ అధినేతగా మాత్రమే కొనసాగుతానని ముఖ్యమంత్రి మరో అభ్యర్థి ఉంటారని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

సీఎం అవ్వాలన్న ఆశలేదని రజినీ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వంలో పార్టీ అధ్యక్షుడి ప్రమేయం ఉండదన్నారు. దివంగత జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలలో శూన్యత ఏర్పడింది. ఇటువంటి తరుణంలో రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ తమిళ రాజకీయాల్లో హైలెట్ వార్త గా నిలిచింది. అయితే ఈ వార్త విన్న మెగాస్టార్ చిరంజీవి..రజినీకాంత్ మంచి నిర్ణయం తీసుకున్నారని తన సన్నిహితుల దగ్గర అన్నట్లు టాక్. ఆ రాజకీయ నాయకుల మధ్య లేకుండా పార్టీ అధ్యక్షుడిగా నడిపించడం అనేది అద్భుతమైన ఆలోచన అని రజనీకాంత్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: