అనుష్క  చాలా గ్యాప్ త‌ర్వాత నిశ‌బ్దం చిత్రంతో తెర‌మీద‌కు రాబోతుంది. జీరోసైజ్ చిత్రంతో కాస్త వెయిట్ పెర‌గ‌డంతో కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతుంది.ఈ సినిమాలో హీరోయిన్ మూగ పాత్ర చేయగా, హీరో గుడ్డివాడైన గాయకుడి పాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ‘నిశ్శబ్ద్టం’ సినిమాలో కూడా అనుష్క మూగదైన పెయింటర్ గా కనిపిస్తుండగా మాధవన్ అంధుడైన మ్యూజిషియన్ పాత్రలో దర్శనం ఇవ్వనున్నారు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా గోపి సుందర్ వ్యవహరిస్తున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏప్రిల్ 2న విడుద‌ల కానున్న ఈచిత్రం 15ఏళ్ళ సినీ కెరియ‌ర్ పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమెను ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా

పూరి జ‌గ‌న్నాధ్ మాట్లాడ‌తూ...ముందు ఈ బంగారు త‌ల్లి నాకు ఎలా దొరికిందో మీకు అంద‌రికీ చెబుతాను `సూప‌ర్` సినిమాలో హీరోయిన్ కోసం బాంబే వెళ్ళాను. అక్క‌డ ఇ.నివాస్ ఒక అమ్మాయి ఉంది చూడు ఎలా ఉందో పంపిస్తున్నాను అని పంపించాడు. సి. ప్రిన్‌సెస్ హోట‌ల్‌లో ఉంటే లాబీలో వెయిట్ చేస్తుండ‌గా ఒక అమ్మాయి వ‌చ్చింది. ఏం పేరు నీది అంటే స్వీటీ అంది.ఫొటో ఏద‌న్నా ఉంటే ఇవ్వ‌మ‌న్నాను. ఆధార్‌కార్డు కోసం దాచుకున్న స్టాంప్ సైజ్ ఫొటో తీసి ఇచ్చింది. వెంట‌నే నాకు అర్ధ‌మ‌యిపోయింది. ఈమె సినిమా ప‌క్షికాదు అని. దాంతో ఫొటో అంటే ఇది కాదు. ఫొటో షూట్ ఏమీ చెయ్య‌లేదా అన్నాను. అలాంటిదేమీ లేదు అంది. యాక్టింగ్ వ‌చ్చా అని అడిగాను. తెలియ‌దు అంది. తెలియ‌దంటే చెయ్య‌గ‌ల‌వా..చెయ‌లేవా అన్నాను. ఎప్పుడూ ట్రై చెయ్య‌లేదు. చేస్తానోలేదో కూడా నాకు తెలియ‌దు అంది డ్యాన్స్ అంటే డ్యాన్స్ కూడా నాకు తెలియ‌దు అంది. స్టెప్ వేస్తే వెయ్యోచ్చులేదంటే లేదు అంది. అప్పుడు నేను ఈ అమ్మాయి నాకు బంప‌ర్ ఆఫ‌ర్లు ఇస్తుంది అనుకున్నా. ఈ అమ్మాయి ఏమో చూడ‌టానికి బావుంది. మా ఆవిడ పైన హోట‌ల్‌లో ఉంటే ఫోన్ చేశ‌ను. ఇక్క‌డ లాబింగ్‌లో ఒక అమ్మాయి ఉంది చూశాను బావుంది అన్నా. నీకు అంద‌రు అమ్మాయిలు న‌చ్చేస్తుంటారు.

 

నేను వ‌చ్చి చూసి చెబుతా అంటూ కింద‌కి వ‌చ్చింది. చాలా బావుంది సినిమాలో పెట్టేద్దాం అంది. త‌ర్వాత నువ్వు ఏం చేస్తావు స్వీటీ అంటే నేను యోగా టీచ‌ర్ అని చెప్పింది. అన్న‌పూర్ణ‌కి నాతో పాటు తీసుకువ‌చ్చాను. నాగార్జునగారు ఈ అమ్మాయిని చూడ‌గానే చాలా బావుంది అన్నారు. సార్ ఈ అమ్మాయిని ఆడిష‌న్ చేద్దాం అంటే. ఆడిష‌న్ ఏమీ అక్క‌ర్లేదు పెట్టేద్దాం అన్నారు.ఆ అమ్మాయి నాకు ఏమీ తెలియ‌దు తెలియ‌దు అంటుంది. అందుకే నాకు చిన్న టెన్ష‌న్ ఉంది సార్‌. పోనీ స‌ర‌దాగా ఫొటో షూట్ అన్నా చేద్దాం అన్నా. ర‌వి మేక‌ప్‌మేన్ స్వీటీ మొహాన్ని ప‌ట్టుకుని ఈ మొహం ఏమిటండీ ఎక‌రంన్న‌ర ఉంది ఈ మొహానికి ఇంత పెద్ద మేక‌ప్ వెయ్యాలా అన్నాడు. అన్న‌పూర్ణ స్టూడియోలోనే వినోద్‌బాల ద‌గ్గ‌ర త‌ను యాక్టింగ్ నేర్చుకుంది. సూప‌ర్ ఎనర్జీతో సూప‌ర్ ఫిల్మ్‌లో స్టార్ట్ అయింది. నాగార్జున‌గారు పేరు అడిగితే స్వీటీ అంది. అదేంటి అస‌లైన పేరు అంటే అదే నా పేరు అంది. పాస్‌పోర్ట్ చూపించింది. నాగార్జున‌గారు అలా కాదు సినిమాకి ఏదో ఒక పేరు ఉండాలి అని చెప్పి ఒక‌సారి  ప్టూడియోకి ఒక అమ్మాయి పాట పాడ‌టానికి వ‌చ్చింది. ఆ అమ్మాయి పేరు అనుష్క నాగార్జున‌గారికి ఆ పేరు చెప్ప‌గానే వెంట‌నే ఈ పేరు ఎవ‌రికి లేదు అది పెట్టేయొచ్చు అని అది పెట్టారు. అనుష్క చాలా మంచిది. ఇందాక‌డ ఏవీ చూశాను. గూస్‌బౌన్స్ వ‌చ్చాయి నాకు. ర‌వితేజ‌, ఛార్మి, నేను అనుష్క‌ని అమ్మ అని పిలుస్తాం. అనుష్క ద‌గ్గ‌ర చాలా నేర్చుకోవాలి. చాలా మంచిత‌నం చాలా తెలివితేట‌లు అన్ని క‌లిసి ఒక కాంబినేష‌న్ అనుష్క‌. మేమంద‌రం క‌లిసిన‌ప్పుడ‌ల్లా ఆమె కాళ్ళ‌కి మొక్కుతాం కావాలంటే అనుష్క‌ని అడ‌గండి. హేమంత్ మ‌ధుక‌ర్ నా ఫ్రెండ్‌. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా రా చూశాను. వెరీగుడ్ ఫెంటాస్టిక్ మూవీ. త‌ను అందులో మూగ పాత్ర‌లో న‌టిస్తోంది. ఏదో సైన్ ల్యాంగ్‌వేజ్ మాట్లాడింది. నిజంగా మూగ‌దోమో అనిపించింది. ఈ అమ్మాయి తెలియ‌దు తెలియ‌దు అంటూ అన్నీ నేర్చుకునే ర‌కం. హేట్పాఫ్ టు అనుష్క సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: