ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న సమయం. చైనా లోని వ్యూహాన్ నగర సరిహద్దుల్లో మొదలైన కరోనా వైరస్  ఇండియాలో లోను తీవ్ర ప్రభావం చూపిస్తు అల్ల కల్లోలం సృష్ఠిస్తోంది. ఈ కరోనా వైరస్ ను భారత దేశంలో శాశ్వతంగా అరికట్టడాని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ పేరుతో కంటికి కనిపించని కరోనా వైరస్ మీద యుద్ధమే ప్రకటించారు. ఇక కరోనా వైరస్ తో పోరాడుతూ రేయింబవళ్లు వైద్యులు- పోలీసులు- జవాన్లు చేస్తున్న సేవల్ని గుర్తించి వారికి సంఘీభావంగా ఆదివారం సాయంత్రం దేశ ప్రజలంతా తమ ఇళ్లలో నుంచే చప్పట్లు.. గంటలు కొట్టి అభినందనలు తెలిపారు.

 

తెలుగు సినీ సెలబ్రిటీల చప్పట్లతో మోత మోగింది. టాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోలు తమ ఇళ్ల లో నుంచే చప్పట్లు కొడుతున్న వీడియోల్ని ... గంటలు మోగిస్తున్న ఫోటోలు- వీడియోల్ని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి ఇంట్లో నుంచి బయటికి వచ్చి చప్పట్లు కొట్టి మ్ర్గా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చప్పట్లు కొట్టడం ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరీ బాల్కనీల్లో నిలబడి చప్పట్లు కొట్టడంపై చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ఇంట్లో గంటను మోగించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వారసుడు అభయ్ రామ్ ఇంట్లో గంటలు మోగించాడు.

 

ఇక మంచు మోహన్ బాబు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనోజ్ బాల్కనీలో నుంచి చప్పట్లు కొట్టి వందేమాతరం అన్నారు. దర్శకుడు పూరి - ఛార్మి బృందం తమ ఆఫీసు ఆవరణలో నిలబడి చప్పట్లు కొట్టారు. పూరీ జగన్నాథ్ తన స్టైల్లో 'నీ అయ్య కరోనా' అన్నాడు. నాగబాబు- వరుణ్ తేజ్ ఫ్యామిలీ నిహారికతో కలిసి చప్పట్లు కొట్టి వైద్యులు- పోలీసులు- జవాన్ లకు అభినందనలు తెలిపారు. వీర్తో పాటు పూజా హెగ్డే, నిఖిల్ సిద్ధార్థ- గోపీచంద్ పలువు సిని తారలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: