టాలీవుడ్ లో, అయినా బుల్లి తెర మీద అయినా సరే యాంకర్ సుమా కు ఉండే క్రేజ్ అందరికి తెలిసిందే. ఆమె బుల్లి తెర మీద కనపడితే చాలు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆమె కు ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది బుల్లి తెర మీద. ఇక ఆమె చేసే సినిమా షోస్ అన్నీ కూడా పాపులర్ అవుతూ ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు సుమా. ఆమె షోస్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. 

 

ఇప్పుడు యాంకర్ గా ఆమె క్రేజ్ తగ్గుతూ వస్తుంది. ఆమె ఇప్పుడు సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తున్నారు. ఆమె నిర్మాతగా సినిమాలు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నానీ హీరో గా ఒక సినిమాను సుమా లైన్లో పెట్టింది అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈ కథ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది టాలీవుడ్ జనాల మాట. దీనిపై స్పష్టత త్వరలో రానుంది. 

 

ఇక ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరు అనేది తెలియాల్సి ఉంది. సుమా సినిమా చేస్తే నానీ తో చెయ్యాలని లేదా విజయ్ దేవరకొండ తో చెయ్యాలని చూస్తుంది అనేది కొన్నాళ్ళ నుంచి వస్తున్న మాట. ఇప్పుడు అనుకున్న విధంగానే ఆమె ఈ సినిమాను వెంకీ కుడుముల దర్శకత్వంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు. కథ కూడా నచ్చడం తో ఇంకా ఆలస్యం చేయకుండా సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో సుమా ఉందని దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: