కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.  అలాగే ఇప్పుడు దేశంలో విస్తరిస్తున్న కరోనాపై ఎన్నో రకాల కార్టూన్లు, గ్రాఫిక్ ఫోటోలు, టిట్ టాక్ వీడియోలు వస్తున్నాయి.  అయితే కొన్ని కరోనాపై అవగాహన పెంచేవి అయితే మరికొన్ని వెటకారంగా వస్తున్నాయి. భారత దేశంలో కరోనా రోజు రోజకీ విస్తరిస్తుంది.. ఈ నేపథ్యంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలని నేతలు, సినీ సెలబ్రెటీలు, క్రీడా రంగానికి చెందిన వారు విన్నపాలు చేసుకుంటున్నారు. చేతులు శుభ్రంగా కడగాలి.. కరోనా లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండాలి.

 

తుమ్మినా, దగ్గినా ఏదైనా అడ్డు పెట్టుకోవాలి.. సామాజిక దూరం తప్పకుండా పాటించాలని అంటున్నారు.  ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనాను తరిమికొట్టాలని ప్రధాని మోదీ దగ్గరనుంచి అన్ని ప్రభుత్వాలు వైద్యులు చెప్తున్నారు. సామాజికి దూరం తో కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉంటుందని అంత సూచిస్తున్నారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సామాజిక దూరం పాటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని నాగ్‌పూర్ పోలీసులు కాస్తంత వినూత్నంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

 

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ , దీపికా పదుకొనె నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలోని సీన్లతో సోషల్ డిస్టెన్స్ పై అవగాహన కల్పిస్తున్నారు.  షారూక్ ఖాన్, దీపిక పడుకొనె ఫొటోను ట్వీట్ చేసి చెబుతున్నారు. ఇందులో ఓ బెంచీపై దీపిక పడుకొనె ఈ చివరన కూర్చుకుంటే షారూక్ ఆ చివరన కూర్చుంటాడు. చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీలో ఈ స్టిల్ ఉంది. సోషల్ డిస్టెన్స్ అంటే ఇదేనని, చేయి తాకనంత దూరంలో ఉండాలంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న నాగ్‌పూర్‌ పోలీసులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: