సినీ రంగంలో ఒకప్పుడు ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అమితాబచ్చన్, రజినీకాంత్, కమల్ హాసన్ అనే వారు.  ఇక విశ్వనటుడు కమల్ హాసన్ అయితే ఎలాంటి పాత్ర అయినా సరే చాలా నేచురల్ గా ఉండాలని.. అందుకోసం ఆయన ఆహార్యంలో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటారు.  ఆ తర్వాత ప్రయోగాత్మక పాత్రల్లో నటుడు విక్రమ్, సూర్య లు చెప్పుకోవచ్చు. ఈ హీరోలు సైతం పాత్రకు అనుగుణంగా తమ స్టైల్ ని మార్చుకుంటున్నారు.  తాజాగా  సౌత్‌ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆకాశం నీ హద్దురా.  నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గురు ఫేం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.

 

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.   2డి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య హీరోగా నిర్మాతగా రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 6వ సినిమా ‘ఆకాశం నీ హద్దురా. మొదటి నుంచి కూడా సూర్య విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అలా ఆయన గతంలో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో 13 ఏళ్ల కుర్రాడిగా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అదే తరహాలో ఇప్పుడు ఆయన మరో ప్రయోగం చేస్తున్నాడు. 'ఆకాశం నీ హద్దురా' టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

 

ఈ సినిమాలో సూర్య కొంత సేపు 19 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నాడట. అలా కనిపించడం కోసం ఆయన గట్టి కసరత్తులే చేసినట్టు సమాచారం.  సూర్య మొదటి నుంచి లుకింగ్ పరంగా విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు.  మరి ఈ 44 ఏళ్ల హీరో 19 ఏళ్ల కుర్రాడిలా ఎలా కనిపించి మెప్పిస్తాడో చూడాలి.  ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్, రిలీజ్ అన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: