గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్  ఖాన్ మృతి చెందారు. పెద్ద ప్రేగు వ్యాధి సంబంధిత సమస్యతో బొంబాయి లోని కోకిలాబెన్  ధీరుభాయి  అంబానీ ఆసుపత్తిలో  చికిత్స తీసుకుంటున్నా బాలీవుడ్ నటుడు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారి తో పోరాటం చేస్తున్న ఇర్ఫాన్ ఖాన్.. కొన్ని నెలల క్రితమే క్యాన్సర్ మహమ్మారి బారిన నుంచి కోరుతున్నారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం మళ్లీ అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి కన్ను మూసారు. 

 


 అయితే ఇర్ఫాన్ ఖాన్ చనిపోవడానికి నాలుగు రోజుల ముందే తల్లి సాయిదా బేగం  మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్లోని జైపూర్లో ఆమెకు అంత్యక్రియలు జరగగా కన్నతల్లి అంత్యక్రియలకు కూడా ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతుండటం... తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేని నేపథ్యంలో తల్లి అంత్యక్రియలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ని చూశారు నటుడు ఇర్ఫాన్ఖాన్. అయితే ఈ ఘటన  ఇర్ఫాన్ ఖాన్ ను మరింత వేదనకు గురి చేసింది. అయితే తల్లి మరణం తో ఆవేదనకు గురైన ఇర్ఫాన్ ఖాన్  అంత్యక్రియలకు కూడా హాజరు కాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారని ఆయన మిత్రులు కూడా మీడియా ముఖంగా తెలిపారు. ఇక ఇర్ఫాన్ ఖాన్  మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. 

 

 కాగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్  మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒక లెజెండరీ నటుని బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కోల్పోయిందని ఇది తీరని లోటు అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ మృతి పై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ మృతి  గురించి తెలుసుకున్నానని ఇది చాలా విచారకర వార్త  అంటూ అమితాబ్ బచ్చన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ ఖాన్ మృతితో  ఆయన అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: