ప్రపంచం కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తుంది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి వైరస్ ఇప్పడు ప్రపంచాన్ని గజ్జున వణికిస్తుంది.  అమెరికా లాంటి అగ్ర రాజ్యాన్ని కుదేలు చేస్తుంది.  ఇప్పటికీ ఇక్కడ 60 వేల మరణాలు సంబవించాయి.   అయితే కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు అండగా పలు స్వచ్చంద సంస్థలు, సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రముఖ అందాల తార శ్రీయ భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో నివసిస్తున్న విషయం తెలిసిందే.  ఈ అమ్మడు ఓ  మంచి పనికి శ్రీకారం చుట్టారు. శ్రియ ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.200 చెల్లించి తనతో కలిసి డ్యాన్స్, యోగా చేయవచ్చంటూ ఆఫర్ ప్రకటించారు. శనివారం సాయంత్రం వరకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

 

గత కొంత కాలంగా కరోనా బాధితులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు... మరోవైపు లాక్ డౌన్ నేపత్యంలో ఎంతో మంది నిరుపేదలు కన్నీరు కారుస్తున్నారు.  ప్రభుత్వాలు ఆదుకుంటున్నా.. ఇలా స్వచ్చంద సంస్థలు మంచి మనసు చేసుకొని ముందుకు వస్తూఅన్నార్తులను ఆదుకుంటున్నారు.  ఇక కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు ‘ది కైండ్‌నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్‌ఫోర్స్ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పిన శ్రియ.. దినసరి కూలీలు, నిరాశ్రయులైన వృద్ధులు, వికలాంగులు, అనాథల కోసం విరాళాలు సేకరించబోతున్నట్టు తెలిపారు.

 

ఈ సందర్భంగా ఇద్దరు విజేతలను ఎంపిక చేస్తామని, వారు తనతో కలిసి డ్యాన్స్, యోగా చేయొచ్చని వివరించారు.  శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని, ఆదివారం విజేతల్ని ప్రకటించి, వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఇందు కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.దికైండ్‌నెస్‌ప్రాజెక్ట్.ఇన్ (www.thekindnessproject.in)లో రూ.200 విరాళంగా చెల్లించి రిసిప్ట్‌ను ఈమెయిల్ చేయాలని శ్రియ పేర్కొన్నారు.  ఒక మంచి పనికోసం అందరం ముందుకు రావాలని ఆమె పిలుపు ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: