అల్లూరి రామరాజు జీవితం మొత్తం 22 ఏళ్ళు. ఆయన గోదావరి, విశాఖ జిల్లాల మధ్యనే తన జీవితం అంతా గడిపారు. ఇక ఆయన గిరిజనుల తరఫున పోరాటం చేసింది నాలుగేళ్ళ పాటు. ఆ సమయంలో ఆయన బ్రిటిష్ సైన్యాన్ని గడగడాలాడించాడు. ఇక అల్లూరి గిరిజనుల్లో చైతన్యాన్ని కలిగించాడు. వారి గుండెల్లో విప్లవ జ్యోతిని వెలిగించాడు.

 

అల్లూరి కధ ఎపుడూ ఒళ్ళు గగ్గుర్పాటు కలిగించేలా ఉంటుంది. అల్లూరి కధను బుర్రకధగా, ఇతర జానపద కధలుగా స్వాతంత్రం పేరిట పోరాడిన  కాలంలో ఎక్కువగా ఉపయోగించేవారు. అలా కళారూపం ఆనాడే సంతరించుకున్న అల్లూరిని వెండితెర మీద నిలువెత్తు రూపం చూపించాలన్న కల ఎన్టీయార్ ది. ఆయనకు 1950 దశకంలోనే ఈ ఆలోచన వచ్చినట్లుగా చెబుతారు.

 

ఇక అల్లూరి పేరిట నాటకాలు ఆడడం అప్పటి వర్ధమాన నటులకు, సినిమాలల్లోకి రాబోయేవారికి అలవాటు. ఇదిలా ఉండగా అల్లూరి పాత్రను వెండి తెర మీద తొలిసారి క్రిష్ణ పోషించాడు. అఖండుడు సినిమాలో ఆయన అల్లూరిగా కనిపించి కనువిందు చేశాడు. ఆ తరువాత ఆయన స్టార్ అయ్యాక అదే కధను సినిమాగా తీయాలని టేకప్ చేశాడు. ఇక అప్పటికే ఆ సినిమా తీయాలన్న కోరిక ఎన్టీయార్ ది. కానీ క్రిష్ణ‌ అల్లూరి సీతారామరాజు తీసి సంచలన విజయం సాధించారు.

 

ఇక ఆ తరువాత ఎన్టీయార్ సర్ధార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో ఆ పాత్రను పోషించి తన కోరికను అలా తీర్చుకున్నారు. ఇక ఆయన తనయుడు బాలక్రిష్ణ కూడా భారతంలో బాలచంద్రుడు, విజయేంద్ర వర్మ వంటి సినిమాల్లో ఆల్లూరి పాత్రలు పోషించి మెప్పించారు.  ఇపుడు చిరంజీవి కుమారుడు రాం చరణ్  రాజమౌళి డైరెక్షన్లో అల్లూరి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

 

మొత్తం మీద చూసుకుంటే అల్లూరి పాత్రను ఎంతమంది పోషించినా ఆ పాత్ర, ఆహార్యం కళ్ల ముందు కనిపించాలంటే మాత్రం క్రిష్ణనే తలచుకోవాలి. అల్లూరిగా అచ్చుగుద్దినట్లుగా క్రిష్ణ సరిపోయారు. నాటికీ, నేటికీ, ఏనాటికీ క్రిష్ణ అంటేన అల్లూరి అనిపించేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: