ఇప్పుడు హీరోలకి ఫ్యాన్స్ పెద్ద తలనొప్పిగా మారారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు, ఎన్టీఆర్, మహేష్, మెగా ఫ్యాన్స్ ఇలా అందరూ తమ హీరోలకి టెన్షన్ పెడుతున్నారు. ఒకప్పుడు పెద్ద పెద్ద విషయాలు ఏమైనా జరిగితే తమ హీరోలకి అండగా ఆయా హీరోల ఫ్యాన్స్ సంఘాల వాళ్ళు రంగంలోకి దిగి తమ అభిమాన హీరోలకి మద్దతుగా మాట్లాడి, అవతలి వారి మాటలను ఖండించేవారు. ఇప్పుడు కాలం మారడంతో సోషల్ మీడియాలో అందరు హీరోల ఫ్యాన్స్ యాక్టివ్ గా ఉంటున్నారు.
ఒకరకంగా వీరివల్లే ఆయా హీరోలు ట్విట్టర్ ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నా అభిమానుల పేరిట తలనొప్పులు తెస్తున్నారు. అభిమానులు రెచ్చిపోతుంటే కంట్రోల్ చేయలేరా ? అని హీరోలని ప్రశ్నించడం తప్ప. ఈ దురభిమానులని కంట్రోల్ చేయలేక పోతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లని పెట్టి ఆర్.ఆర్.ఆర్ అన్న భారీ పాన్ ఇండియన్ సినిమా రూపొందిస్తున్నాడు రాజమౌళి. దాదాపు 7 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ నెల 5 నుంచి ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ తిరిగి మొదలైంది.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తుండగా కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే చరణ్ వీడియో టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా ఈ నెల 22 న కొమరం భీమ్ పాత్రని రివీల్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ టీజర్ విషయంలో ఆ ఇద్దరి ఫ్యాన్స్ కొట్టుకుంటున్న విధానం చూస్తుంటే చిరాకు వేస్తోంది. మరీ ఇంత వరస్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారా ? అనిపిస్తుంది. తమ అభిమాన హీరో గొప్ప అనిపించుకోడానికి మరో హీరోని కించపరుస్తూ వాళ్ళు పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: