ఒక సాదాసీదా సినిమాగా వచ్చిన కే జి ఎఫ్ సినిమా ఎంతటి సెన్సేషన్ సృష్టించినదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపేసింది కే జి ఎఫ్ . తమిళ నటుడు విజయ్ హీరోగా నటించిన కేజిఎఫ్ హీరో యష్ ని  ఒక్కసారిగా స్టార్ హీరోని చేసి అన్ని  ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగి పోయే కథ కథనంతో దర్శకుడు కే జి ఎఫ్ సినిమాను  తెరకెక్కించిన తీరు అందరినీ కట్టిపడేసింది. అయితే కేవలం టాక్ పరంగానే  మాత్రమే కాకుండా వసూళ్ళ పరంగా కూడా కే జి ఎఫ్ సినిమా భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.



 సినిమా చూస్తున్న అభిమానులు అందరూ తర్వాత ఏం జరుగుతుంది హీరో ఏం చేయబోతున్నాడు అని హీరో కంటే ఎక్కువగా టెన్షన్ పడే విధంగా ప్రేక్షకులందరూ సినిమాలు లీనం అయ్యే విధంగా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఇక ఆ తర్వాత కే జి ఎఫ్ 2 సినిమా తెరకెక్కించేందుకు అంత సిద్ధమై ప్రస్తుతం షూటింగ్ కూడా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగినప్పటికీ కరోనా  వైరస్ కారణంగా సినిమా షూటింగ్ కీ  బ్రేక్ పడటంతో ఆలస్యం అయ్యింది. ఇక ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది.



 తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ అప్డేట్ కాస్త అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈరోజు రవీనాటాండన్ పుట్టినరోజు సందర్భంగా కే జి ఎఫ్ 2 లో  ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇక కే జి ఎఫ్ 2 సినిమాలో రవీనా టాండన్ రమిక  సేన్  అనే పాత్రలో నటిస్తోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ లో రవీనా టాండన్ ఎంతో ఆసక్తికర లుక్ తో కనిపిస్తూ ఉంది. చట్టసభల్లో పూర్తిగా ఎరుపు రంగు చీర కట్టుకొని ఉంది రవీనా టాండన్. కాగా  కే జి ఎఫ్ 2 వచ్చే సంక్రాంతికి విడుదలయ్యేందుకు అంతా సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: