టాలీవుడ్ లో ప్రస్తుతం త్రివిక్రమ్ కి మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి హీరో ఈ దర్శకుడి కోసం పోటీ పడుతున్నాడు.. ఒక్కసారి సినిమా చేసిన వాళ్ళు కూడా త్రివిక్రమ్ తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నారు అంటే హీరోలకు ఎంత ఫ్రీడమ్ ఇస్తాడో అర్థం చేసుకోవచ్చు.. పైగా హిట్ లు కూడా ఇస్తుండడంతో త్రివిక్రమ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. తన సినిమాల్లో చేసిన ఏ హీరో అయినా ఒక మెట్టు పైకి ఎక్కుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. స్టార్ డమ్ ని కూడా అమాంతం పెంచేలా చేస్తాడు త్రివిక్రమ్..

ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అంతకుముందు అల్లు అర్జున్ తో ఆలా వైకుంఠపురం చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.. అల్లు అర్జున్ కి, త్రివిక్రమ్ కి ఈ సినిమా ఎంతో ముఖ్యం కాగా ఈ సినిమా తో ఇద్దరు సాలిడ్ హిట్స్ కొట్టారు.. ఎన్టీఆర్ ప్రస్తుతం rrr సినిమా లో బిజీ గా ఉండగా ఎన్టీఆర్ వచ్చే లోగా స్క్రిప్ట్ ని ఇంకా స్క్రిప్కీ గా మారుస్తున్నారు.. rrr సినిమా తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అవడం ఖాయం.. అయితే ఈ పాన్ ఇండియా స్టార్ ని త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అన్నదే అసలు ప్రశ్న.. \

ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్.’తో  పాన్ ఇండియా మార్కెట్‌లోకి వెళుతున్నాడు. అందుకని త్రివిక్రమ్ చేసే రెగ్యులర్ కుటుంబ కథా చిత్రాలు చేస్తే పాన్ ఇండియా అప్పీల్ కష్టమవుతుంది. అందుకే త్రివిక్రమ్ ఈసారి తన జోన్ వదిలి బయటకు రాక తప్పదు. నిజానికి త్రివిక్రమ్ గతంలో మంచి ఐడియాలతో యాక్షన్ ప్రధాన సినిమాలు చేస్తుండేవాడు.అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ కథలు ఒక ఇంటికి, రెండు కుటుంబాలకు పరిమితం అవుతూ వస్తున్నాయి. అజ్ఞాతవాసి కథ యాక్షన్ సినిమాగా తీస్తే ఫలితం మరోలా వుండేది కానీ అక్కడ కూడా త్రివిక్రమ్ తన టెంప్లేట్ విడిచిపెట్టక దెబ్బ తిన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: