బిగ్ బాస్ సీజన్ 4లో వన్ ఆఫ్ స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న నోయెల్ హౌజ్ లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఫిజికల్ టాస్కుల్లో టఫ్ ఫైట్ ఇచ్చే స్టామినా ఉన్నా సరే అతను ఎందుకో ఆటలో వెనకపడుతున్నాడు. అయితే అతని లెగ్ పెయిన్ అతన్ని వెనకపడేలా చేస్తుంది. అంతేకాదు కొత్తగా అతనికి షోల్డర్ పెయిన్ కూడా వచ్చిందని టాక్. నిన్న ఎపిసోడ్ లో నోయెల్ బిగ్ బాస్ తో కూడా మాట్లాడినట్టు ఉన్నాడు.

అయితే అది ఎపిసోడ్ లో చూపించలేదు కాని అన్ సీన్ లో చూపించారని తెలుస్తుంది. డాక్టర్ సలహా మేరకు తాను కూడా హౌజ్ నుండి బయటకు వెళ్తానని అంటున్నాడు నోయెల్. ఇప్పటికే గంగవ్వ హౌజ్ నుండి ఎలిమినేట్ అవకుండా అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ సీజన్ లో మరో కంటెస్టంట్ నోయెల్ కూడా అదే విధంగా హౌజ్ నుండి బయటకు వెళ్లాలని చూస్తున్నాడు. మరి గంగవ్వ లానే నోయెల్ కూడా బయటకు వస్తాడా లేక డాక్టర్స్ సూచనలతో హౌజ్ లోనే ఉంటాడా అన్నది చూడాలి.

నామినేషన్స్ లో కూడా నోయెల్ ఉంటున్నా అతని ఫ్యాన్స్ అతనికి ఓటు వేసి సేవ్ చేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో నోయెల్ లేడు అయినా సరే ఈ వీకెండ్ అతన్ని హౌజ్ నుండి బయటకు కంపిస్తారని అంటున్నారు. మరి నోయెల్ హౌజ్ నుండి బయటకువ్ వస్తాడా లేక హౌజ్ లో ఉంటాడా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ సీజన్ లో సూపర్ స్ట్రాంగ్ అనుకున్న నోయెల్ ఇలా వీక్ అవడం షాకింగ్ గానే ఉంది.                                                  
 

మరింత సమాచారం తెలుసుకోండి: