టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్ల విషయంలో ముందు నుంచి కూడా జాగ్రత్త పడుతూ ఉంటారు. వారు ఏ పాత్రలో నటించిన సరే వారి పాత్రకు సంబంధించి కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తారు. అందులో ప్రధానంగా అనుష్క సినిమాల్లో కాస్త ఎక్కువగానే దృష్టిపెడతారు. అనుష్క సినిమాలు చేసే విషయంలో ఎలాంటి పాత్ర అయినా సరే నటించడానికి ఆసక్తి గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె  కొన్ని పాత్రలు చేసే విషయంలో కాస్త తగ్గుతుంది అనే భావన టాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాజాగా వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే అనుష్క సినిమాలు చేసే విషయంలో గతంలో మాదిరిగా హుషారుగా లేదు అని అంటున్నారు.

అయితే ఇప్పుడు తన పాత్రల విషయంలో కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. గతంలో మాదిరిగా గ్లామర్ రోల్స్ చేయకుండా ఇప్పుడు చేసే పాత్రలు కాస్త ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం ఆమె ఈ రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాల్లో కూడా ఆమె కాస్త భిన్నంగా కనపడే అవకాశం ఉంది. ఒక సినిమాలో ఆమె అమ్మ పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఆ సినిమాలో ఆమె పాత్ర ముందు ఒక వేశ్య గా ఉంటుందని... ఆ తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుందని ఆ తర్వాత ఆమె ఏ విధంగా రాణిస్తుంది అనే దానిపైనే సినిమా మొత్తం ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి దర్శకుడు కూడా ఆమెకు ఒక మంచి కథ చెప్పారని ఆ కథ చాలా బాగా వచ్చింది అని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలు పెడతారు ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: