విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు మన అందరికీ తెలుస్తూనే ఉంటాయి. ఇప్పటికే వాళ్ళిద్దరూ కలిసి బహిరంగ ప్రదేశాల్లోనే తమ ప్రేమను వ్యక్తపరిచారు. కొంచెం ప్రేమ చూపించుకున్న వారి మధ్య క్షణాలు నెట్టింట వైరల్ అవుతాయి. ప్రస్తుతం కూడా విరాట్ కోహ్లీ తన భార్యపై చూపిన ప్రేమ, ఆప్యాయతలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫోటోలు వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుష్క శర్మ ధరించిన వస్త్రాలను ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. ఇప్పుడు అదే నేహా కక్కర్ కి కొరకరాని కొయ్యగా మారింది.


పూర్తి వివరాలు తెలుసుకుంటే.. అనుష్క శర్మ ధరించిన వస్త్రాలు లాంటి వే ప్రముఖ భారతీయ సింగర్ నేహా కక్కర్ ధరించారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోకా కోలా పాట పాడే బాగా ఫేమస్ అయిన నేహా కక్కర్ రోహన్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే తన పెళ్లి కార్యక్రమాలన్నిటిలో అనుష్క శర్మ తన పెళ్ళికి ధరించిన వస్త్రాల డిజైన్ లాంటివే ధరించారు. దీంతో ఆమె అనుష్క శర్మ ఫ్యాషన్ డిజైన్ ని కాపీ కొట్టారని ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. గతంలో గీత ఫోగాట్ కూడా అనుష్క శర్మ తన పెళ్లి సమయంలో ఎటువంటి వస్త్రాలను ధరించారో అచ్చం అలాంటివే సబ్యసాచి చేత డిజైన్ చేయించారు. దీంతో ఆమెపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.


ఇకపోతే విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ఆడడానికి దుబాయ్ కి వెళ్లారు. ఆయనతో పాటే అనుష్క శర్మ కూడా దుబాయ్ కి వెళ్లి ఉంటుంది. ప్రతి మ్యాచ్ కు అనుష్క శర్మ వచ్చి విరాట్ కోహ్లీ బాగా ఆడేలాగా ప్రోత్సహిస్తుంది.


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్ కి కెప్టెన్‌ అయిన విరాట్‌ కోహ్లీ... తన భార్య అనుష్క శర్మ ని తిన్నావా అని అడిగారు. గత ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు అనుష్క స్టేడియానికి రాగా మ్యాచ్‌ బ్రేక్ టైమ్ లో ప్రేక్షకుల సీట్లలో కూర్చొని ఉన్న అనుష్క వైపు చూస్తూ ఏమైనా తిన్నావా? అని కోహ్లీ  సైగలతో అడిగారు. అందుకు సమాధానంగా హా..తిన్నాను అంటూ అనుష్క తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: