ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ పొజిషన్ లో ఉంది. టాలీవుడ్ మొత్తం మీద అందరి హీరోయిన్ల కంటే ఈమె ఎక్కువ పారితోషికం అందుకుంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మిగతా నటీనటులు హీరో హీరోయిన్లు తమతమ రెమ్యునరేషన్ను తగ్గించుకుంటే ఈమె మాత్రం దాన్ని రెండింతలు చేసింది. అయినా ఈమెకు ఉన్న క్రేజ్ చూసి నిర్మాతలు ఈమెను తమ సినిమాల్లో నటింప చేయాలని ఫిక్స్ అయిపోయారు. అందుకే రేటు కాస్త ఎక్కువే అయినా ఈమెనే తమ సినిమాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే తాజాగా ఈ భామ డ్రెస్సింగ్ గురించి బాలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అదేంటంటే ఈమె అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తోంది. ఇందులో స్టాండ్ కమెడియన్ పాత్రలు పూజ నటిస్తోంది.ఆ మధ్య షూటింగ్ జరుగుతున్న సమయంలో పూజ అఖిల్ లు ఇద్దరూ కలిసి ఉన్న ఒక పిక్ ని అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ పిక్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అందులో పూజ వేసుకున్న డ్రస్సు అచ్చం బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా వేసుకున్న డ్రస్సు ని పోలి ఉండటం గమనార్హం.

ఊర్వశి రౌతేలా లేటెస్ట్ సినిమా వర్జిన్ భానుప్రియ సినిమాలో ఉపయోగించిన డ్రెస్సింగ్ స్టైల్ ని పూజ కాపీ కొట్టిందని బాలీవుడ్ జనాలు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సినిమా స్టార్స్ కి కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు. తమకు నచ్చిన బట్టలు బయట వేసుకునే అవకాశం స్టార్స్ ఉంటుందేమో గాని సినిమా సెట్స్ లో గాని షూట్లో గాని డిజైనర్ చెప్పిన బట్టలే వేసుకోవాలి. ఈ లెక్కన పూజ కాపీ కొట్టింది అనే ప్రచారం అంతా ట్రాష్ అనిపిస్తోంది కదూ.

మరింత సమాచారం తెలుసుకోండి: